kumaram bheem asifabad- ఎమ్మెల్సీని అడ్డుకున్న గ్రామస్తులు
ABN , Publish Date - Sep 19 , 2026 | 11:31 PM
చీలపెల్లి వెళ్లే రహదారిపై ఇటీవల కురిసిన వర్షాలకు వంతెన కొట్టుక పోవడంతో శనివారం ఎమ్మెల్సీ దండే విఠల్ పరిశీలించడానికి వచ్చిన క్రమంలో గ్రామస్తులు, సర్పంచులు వద్ద రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్సీని అడ్డుకున్నారు.
సిర్పూరు(టి), సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): సిర్పూరు(టి)-చీలపెల్లి వెళ్లే రహదారిపై ఇటీవల కురిసిన వర్షాలకు వంతెన కొట్టుక పోవడంతో శనివారం ఎమ్మెల్సీ దండే విఠల్ పరిశీలించడానికి వచ్చిన క్రమంలో గ్రామస్తులు, సర్పంచులు వద్ద రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్సీని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ వంతెనకు కేటాయించే రూ.10లక్షలు సరిపోవని వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మరో కల్వర్టును చూసేందుకు బయలు దేరారు. తిరుగు ప్రయాణం చేసిన క్రమంలో గ్రామస్తులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ రూ.10లక్షల నిధులు కేటాయించిందని, ఈ నిధులతో పాటు మరో రూ.10లక్షలు నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా అటవీ శాఖ అధికారులతో మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో మరో చెక్ డ్యాంల నిర్మాణం అయ్యేట్టు కృషి చేస్తానని భరోసా కల్పించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. గ్రామస్తులు ఎమ్మెల్సీ కృతజ్ఙతలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ సంతోష్ కుమార్ బందోబస్తు నిర్వహించారు.