kumaram bheem asifabad- పల్లె సారఽథి... పట్టించుకుంటేనే ప్రగతి
ABN , Publish Date - Feb 15 , 2026 | 11:27 PM
చివరి మజిలి కష్టాలు తీర్చాలని ప్రతి పంచాయతీలకు శ్మశాన వాటికలు నిర్మించారు. అవి ప్రస్తు తం నిర్లక్షానికి గురవ్వంతో అందులో పిచ్చి మొక్కలు, ముళ్లపొదలకు అవాసంగా మారుతున్నాయి. జైనూరు మండలంలోని పలు గ్రామాల్లో సరైన దారులు లేక పోవడంతో అంతిమ సంస్కారం చేసేందుకు స్థానికులు వెళ్లలేని దుస్థితి నెలకొంది
- గ్రామస్థుల అవస్థలు
జైనూర్/సిర్పూర్(యు)/ లింగాపూర్ ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): చివరి మజిలి కష్టాలు తీర్చాలని ప్రతి పంచాయతీలకు శ్మశాన వాటికలు నిర్మించారు. అవి ప్రస్తు తం నిర్లక్షానికి గురవ్వంతో అందులో పిచ్చి మొక్కలు, ముళ్లపొదలకు అవాసంగా మారుతున్నాయి. జైనూరు మండలంలోని పలు గ్రామాల్లో సరైన దారులు లేక పోవడంతో అంతిమ సంస్కారం చేసేందుకు స్థానికులు వెళ్లలేని దుస్థితి నెలకొంది. పల్లె సీమలు అభివృధ్ధి చెందితేనే దేశం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పల్లె ప్రగతి పథకం కింద ఉపాధి హామీ నిధులతో జిల్లాలోని 335 గ్రామ పంచాయతీల్లో వైకుంఠ ధామాలు, సెగ్రిగేషన్ డంపింగ్ యార్డులు పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణాలు వంటి అభివృద్ధి పనులు చేపట్టిం ది. కానీ గత రెండేళ్లుగా పంచాయతీలకు పాలక వర్గాలు లేక పోవడంతో పల్లె ప్రగతి పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్వహణ అస్త వ్యస్తంగా ఉండి నిరూప యోగంగా తయారైంది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు పల్లె ప్రగతి పనులపై దృష్టి సారించి గ్రామాల్లో వసతులు కల్పించాలన్సిన అవసరం ఎంతైన ఉంది. పల్లెల్లో పచ్చదనం పెంచడానికి, ఆహ్లాదకర వాతావరణం కల్పించడానికి గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. వీటిలో వృద్ధులు, పిల్లలు కూర్చునేందుకు కూర్చీలు ఏర్పాటు చేశారు, చిన్నారులకు వాకింగ్ ట్రాక్ వంటి వసతులు కల్పించారు. కానీ ప్రస్తుతం పల్లె ప్రకృతి వనం నిర్వాహణను పంచాయతీ అధికారులుపూర్తిగా విస్మరంచారన్న ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. లింగాపూర్, సిర్పూర్(యు) మండలంలోని ప్రకృతి వనంలో మొక్కలు లేక పోవడం, ముళ్ల చెట్లు ఏపుగా పెరగడం, చుట్టు ఉన్న సంరక్షణ కంచె ధ్వంసమయ్యాయి. సర్పంచ్‌లు స్పందించి సమస్యల పరిష్కా రానికి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.