గ్రామ సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Sep 26 , 2026 | 11:37 PM
తమ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూ పల్లి కృష్ణారావుకు మండలంలోని రా జాపూర్ గ్రామ రైతులు మొరపెట్టు కున్నారు.
- మంత్రి జూపల్లి కృష్ణారావుకు రాజాపూర్ రైతుల వినతి
కోడేరు, సెప్టెంబరు 26 (ఆంధ్ర జ్యోతి) : తమ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూ పల్లి కృష్ణారావుకు మండలంలోని రా జాపూర్ గ్రామ రైతులు మొరపెట్టు కున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు సాంబశివు డు తెలిపారు. శనివారం మండల పరి ధిలోని రాజాపూర్ గ్రామరైతులు ఎమ్మె ల్యే క్యాంపు ఆఫీసుకు వెళ్లి జూపల్లితో సమస్య లను ఏకరువు పెట్టినట్లు తెలిపారు. కె.ఎల్.ఐ, డి-8 కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చూడాలని కోరారు. అందుకు మంత్రి సంబంధి త అధికారులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి చివరి ఆయకట్టు వరకు సాగునీటిని విడుదల చేయాలని ఆదేశించారని తెలిపారు. గ్రామంలో విద్యుత్ స్తంభాల సమస్య ఉందని, గ్రామంలో సబ్సిడీ స్ర్పింక్లర్లు ఇవ్వాలని కోరగా, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచు ఎండీ సిరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయ కులు డ్రైవర్ బాలయ్య, గొల్ల కురుమయ్య , బాలచంద్రి, గండి వెంకటయ్య, విష్ణు, పల్లె కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.