Share News

kumaram bheem asifabad- గ్రామ, వార్డుసభలు నిర్వహించాలి

ABN , Publish Date - Jun 03 , 2026 | 10:10 PM

గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో గ్రామ, వార్డుసభలు నిర్వహించి పలు కీలక అంశాలపై చర్చించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరం నుంచి అన్ని మండలాల అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక యాక్షన ప్లాన్‌లో భాగంగా సభలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.

kumaram bheem asifabad- గ్రామ, వార్డుసభలు నిర్వహించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ కె హరిత,

ఆసిఫాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో గ్రామ, వార్డుసభలు నిర్వహించి పలు కీలక అంశాలపై చర్చించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరం నుంచి అన్ని మండలాల అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక యాక్షన ప్లాన్‌లో భాగంగా సభలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. రాబోయే వర్షాకాలంను దృష్టిలో పెట్టుకుని తాగునీరు కలుషితం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా పైప్‌లైన్‌ లీకేజీలు ఉంటే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. క్లోరినేషన్‌ ప్రక్రియ నిరంతరం జరిగేలా చూడాలని పరిశుభ్రత పాటించాలని చెప్పారు. విత్తనాలు ఎరువులు సకాలంలో రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించి సరైన వైద్య సహాయం అందించాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు అవసరమైన రుణాలు ప్రోత్సాహం అందిచాలన్నారు. విద్యుత్‌ ఆదా సమస్యల పరిష్కారాలపై ప్రతిభ చాటిన ఉద్యోగులకు ప్రోత్సహకాలతో పాటు నగదు బహుమతి అందించాలని సూచించారు. బీఎల్‌వోలు ఓటరు నమోదు, సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా గ్రామసభల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, జడ్పీసీఈవో లక్ష్మీనారాయణ, డీఆర్డీవో దత్తారావు, డీపీవో భిక్షపతి, మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, ఈఈలు, వ్యవసాయ, వైద్య, ఆరో గ్య శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.

కార్యాలయాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కాఆర్యలయాలను బుధవారం జిల్లా కలెక్టర్‌ కె హరిత ఆకస్మికంగా తనిఖీ నిర్వహిం చారు. జిల్లా కేంద్రంలోని నీటి పారుదల కార్యనిర్వహక ఇంజనీర్‌ కార్యాలయం, పంచాయతీ రాజ్‌ భవనాల శాఖ సబ్‌ డివిజన్‌ కాఆ్యలయాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమయ పాలనను పాటించాలన్నారు. నీటి పారుదల శాఖ కార్యనిర్వహాక ఇంజనీర్‌ కార్యాలయంలో మాట్లాడుతూ చెరువులు, కాలువల మరమ్మతులను త్వరితగతిన చేయాలని, ఎలాంటి ఆటంకం కలగకుండా సాగునీటిని అందించాలని కోరారు. కాలువలలో పూడికతీత పనులు త్వరిగతిన పూర్తి చేయా లని చెప్పారు. కాలువల తూముల మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.

Updated Date - Jun 03 , 2026 | 10:11 PM