ధనిక్ భారత్‌తో ఒత్తిడి లేని విద్య
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:36 AM
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒత్తిడి లేని నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ‘ధనిక్ భారత్’ విద్యా సంస్థలను ప్రారంభిస్తున్నామని లాయిడ్ గ్రూప్ అధినేత, ధనిక్ భారత్ వ్యవస్థాపకులు విక్రమ్ నారాయణరావు ....
లాయిడ్ గ్రూప్ అధినేత విక్రమ్ నారాయణరావు
హైదరాబాద్ సిటీ, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) : ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒత్తిడి లేని నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ‘ధనిక్ భారత్’ విద్యా సంస్థలను ప్రారంభిస్తున్నామని లాయిడ్ గ్రూప్ అధినేత, ధనిక్ భారత్ వ్యవస్థాపకులు విక్రమ్ నారాయణరావు ప్రకటించారు.తమ విద్యా సంస్థల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ విద్య బలోపేతానికి కృషి చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని సీఎ్‌సబీ ఐఏఎస్ అకాడమీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లాయిడ్ సంస్థకు ఫార్మా రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉందని, సమాజానికి ఏమైనా చేయాలనే ఆలోచనతో విద్యాసంస్థలను ప్రారంభిస్తున్నా మని చెప్పారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో ఈ సంవత్సరం 16 బ్రాంచీలను ప్రారంభిస్తామని తెలిపారు. సీఎ్‌సబీ ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకురాలు, ధనిక్ భారత్ విద్యా సంస్థల డైరెక్టర్ ఎం.బాలలత మాట్లాడుతూ దేశంలో ఇంటర్ విద్యలో మార్పులు తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు.