బీఫాం బీఆర్‌ఎస్‌ది.. ప్రచారం కాంగ్రెస్‌కు!
ABN , Publish Date - Feb 07 , 2026 | 04:50 AM
ఆయన బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగారు. కానీ ఇప్పుడు కాంగ్రె్‌సకు ప్రచారం చేస్తున్నాడు. ఈ విచిత్రం వికారాబాద్‌లో చోటు చేసుకుంది.
వికారాబాద్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఆయన బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగారు. కానీ ఇప్పుడు కాంగ్రె్‌సకు ప్రచారం చేస్తున్నాడు. ఈ విచిత్రం వికారాబాద్‌లో చోటు చేసుకుంది. వికారాబాద్ మునిసిపాలిటీలో కాంగ్రెస్ చైర్‌పర్సన్ అభ్యర్థి గడ్డం అనన్య పోటీ చేస్తున్న 17వ వార్డులో.. బీఆర్‌ఎస్ నాయకుడు తోళ్ల ఆనంద్‌కుమార్ కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఇతరులు కూడా పోటీ పడినా.. పార్టీ ఆనంద్‌కుమార్‌కే బీఫాం ఇచ్చింది. కానీ, ఈనెల 4వ తేదీ రాత్రి ఆయన అనూహ్యంగా కాంగ్రె్‌సలో చేరారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అనన్యకు మద్దతు తెలుపుతూ పోటీ నుంచి తప్పుకొన్నారు. బుధవారం వరకూ బీఆర్‌ఎస్ తరపున ప్రచారం చేసిన ఆయన.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. ఇదే మునిసిపాలిటీలో 20వ వార్డులో బీఆర్‌ఎస్ రెబల్‌గా బరిలో ఉన్న ఉడుత సంధ్య భర్త ఆనంద్ శుక్రవారం రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన మరికొందరు కౌన్సిలర్ అభ్యర్థులు కూడా కాంగ్రె్‌సతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.