Share News

కూలీల వేషంలో ఉన్న నలుగురు నక్సల్స్‌ అరెస్ట్‌

ABN , Publish Date - May 11 , 2026 | 06:26 AM

ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చి రైల్వే కూలీలుగా పని చేస్తున్న నలుగురు నక్సలైట్లను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.

కూలీల వేషంలో ఉన్న నలుగురు నక్సల్స్‌ అరెస్ట్‌

  • వికారాబాద్‌ జిల్లా రుక్మాపూర్‌లో ఘటన

వికారాబాద్‌, పెద్దేముల్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చి రైల్వే కూలీలుగా పని చేస్తున్న నలుగురు నక్సలైట్లను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ మండలంలోని రుక్మాపూర్‌ స్టేషన్‌ వద్ద జరుగుతున్న రైల్వే పనుల్లో ఈ నలుగురు నక్సలైట్లు సాధారణ కూలీలుగా చేరారు. రైల్వే క్వార్టర్లలో ఆశ్రయం పొందారు. ఛత్తీస్‌గఢ్ లోని నారాయణపూర్‌కు చెందిన వీరు.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఇక్కడ పని చేస్తున్న అదే రాష్ట్రానికి చెందిన 30 కూలీల్లో కలిసిపోయారు. అయితే, వారొచ్చిన వారం రోజుల్లో ఉనికిని పసిగట్టిన మహారాష్ట్ర పోలీసులు ఆదివారం తెల్లవారుజామున తాండూరు డీఎస్పీని సంప్రదించి నక్సలైట్ల గురించి వివరించారు. పోలీసులు ఆదివారం తెల్లవారు జామున నక్సలైట్లను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - May 11 , 2026 | 06:27 AM