విజయ డెయిరీని ప్రారంభించాలి
ABN , Publish Date - Sep 24 , 2026 | 11:17 PM
మండల పరిధిలోని పెద్దకార్పా ముల గ్రామంలో నిర్మాణం పూర్తయిన వి జయ డెయిరీని వెంటనే ప్రారంభించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎం.శ్రీనివా సులు డిమాండ్ చేశారు.
- సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు శ్రీనివాసులు
పెద్దకొత్తపల్లి, సెప్టెంబరు 24 (ఆంధ్ర జ్యోతి) : మండల పరిధిలోని పెద్దకార్పా ముల గ్రామంలో నిర్మాణం పూర్తయిన వి జయ డెయిరీని వెంటనే ప్రారంభించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎం.శ్రీనివా సులు డిమాండ్ చేశారు. గురువారం మం డల కేంద్రంలో విలేకర్ల సమావేశంలో ఆ యన మాట్లాడారు. రెండు సంవత్సరాల కిందట పూర్తయిన విజయ డెయిరీని నే టికీప్రారంభించకపోవడంతో కొల్లాపూర్ ప్రాం తంలోని పాడిరైతులు తీవ్రంగా నష్టపోతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విజయ డెయిరీని ప్రారంభించి ప్రభుత్వ డెయిరీ ద్వారా పాడి రైతుకు అందించే అ న్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆయన ప్ర భుత్వాన్ని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ తా లూకాలోని కోడేరు, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, కొల్లాపూర్ ప్రాంతాల్లోని పాడి రైతులు గణనీ యంగా ఉన్నారని ప్రభుత్వ విజయడైరీ ప్రారం భం కాకపోవడంతో ప్రైవేట్ డైరీలకు మ్ముకుం టూ నష్టపోతున్నారని, తక్షణమే విజయ డె యిరీ ప్రారంభించి ఆయా మండలాల్లో గ్రామా ల్లో పాల సేకరణ పాయింట్లను ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాం డ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి ఎం.దశరథం, మండల కమిటీ సభ్యు లు బాల స్వామి పాల్గొన్నారు.