Share News

మునిసిపల్‌ కార్యాలయాల్లో విజిలెన్స్‌ సోదాలు

ABN , Publish Date - Apr 02 , 2026 | 03:26 AM

మల్కాజిగిరి మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పలు సర్కిల్‌ కార్యాలయాలు, సరూర్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, హయత్‌నగర్‌ సర్కిల్‌ కార్యాలయాలతో పాటు బండ్లగూడ రెవెన్యూ కార్యాలయంలో...

మునిసిపల్‌ కార్యాలయాల్లో విజిలెన్స్‌ సోదాలు

  • పలు అవకతవకల గుర్తింపు.. త్వరలో ప్రభుత్వానికి నివేదిక

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): మల్కాజిగిరి మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పలు సర్కిల్‌ కార్యాలయాలు, సరూర్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, హయత్‌నగర్‌ సర్కిల్‌ కార్యాలయాలతో పాటు బండ్లగూడ రెవెన్యూ కార్యాలయంలో విజిలెన్స్‌ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ఆయా కార్యాలయాలకు చేరుకున్న అధికారులు.. ఆ సమయానికి కూడా చాలా మంది ఉద్యోగులు ఇంకా విధులకు హాజరుకాకపోవడాన్ని గమనించారు. అటెండెన్స్‌ రిజిష్టర్లు, ఫీల్డ్‌ విజిట్‌ రికార్డులను పరిశీలించారు. ఏయే అధికారి వద్ద ఎన్ని ఫైల్స్‌ పెండింగ్‌లో ఉన్నాయి, క్లియర్‌ అయిన వాటిని కూడా పెండింగ్‌ ఫైళ్లలో ఉంచుకోవడానికి కారణాలేంటి? అనే అంశాలపై ఆరా తీశారు. టౌన్‌ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌ సెక్షన్లు, రెవెన్యూ కార్యాలయాల్లో అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించారు. తనిఖీల సందర్భంగా గుర్తించిన అవకతవకలపై ప్రభుత్వానికి నివేదిక అందచేయనున్నట్లు తెలిపారు.

Updated Date - Apr 02 , 2026 | 03:26 AM