Share News

రైసుమిల్లుల్లో విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు

ABN , Publish Date - Oct 09 , 2026 | 11:46 PM

మండలంలోని పలు రైసుమి ల్లుల్లో రాష్ట్ర పౌరసరఫ రాల శాఖకు చెందిన విజిలెన్స్‌ అధికారులు శుక్రవారం తని ఖీలు నిర్వహించారు. ఇందారం గ్రామంలోని ధనలక్ష్మీ రైసుమిల్లు, మంజునాధ ఆగ్రో ఇండస్ర్టీస్‌ రైసుమిల్లుల్లో తనిఖీలు చేశారు.

రైసుమిల్లుల్లో విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు
ఇందారంలో రైసుమిల్లులో తనిఖీలుచేస్తున్న విజిలెన్స్‌ అధికారులు

జైపూర్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని పలు రైసుమి ల్లుల్లో రాష్ట్ర పౌరసరఫ రాల శాఖకు చెందిన విజిలెన్స్‌ అధికారులు శుక్రవారం తని ఖీలు నిర్వహించారు. ఇందారం గ్రామంలోని ధనలక్ష్మీ రైసుమిల్లు, మంజునాధ ఆగ్రో ఇండస్ర్టీస్‌ రైసుమిల్లుల్లో తనిఖీలు చేశారు. రైతుల వద్ద నుంచి ప్రభుత్వం మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేసి కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం రైసుమిల్లులకు ధాన్యాన్ని కేటాయించడం మిల్లుల్లో అవకతవకలు జరుగుతున్న సందర్భంలో ఈ మేరకు అధికారులు తనిఖీలు నిర్వహించారు. సీఎంఆర్‌ బియ్యం సకాలం లో అప్పగిస్తున్నారా, కేటాయించిన ధాన్యం నిల్వలు మిల్లులో ఉన్నాయా, ధా న్యం కొనుగోలు, నిల్వలు మిల్లింగ్‌కు సంబంధించి లెక్కలు సక్రమంగా నిర్వహి స్తున్నారా అని తనిఖీలు నిర్వహించారు. నిల్వలు, మిల్లింగ్‌ రికార్డులను పరిశీ లించారు. నిల్వలు, రికార్డులకు సంబంధించి వ్యత్యాసాలు ఉన్నాయనే దానిపై విచారణ చేపట్టారు. అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలమేరకు త నిఖీలు నిర్వహిస్తున్నామని, ఇవి సాధారణ తనిఖీలు మాత్రమేనని, తేడాలుంటే తగు సమాచారం అందిస్తామన్నారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్‌ అధికారులు ఇన్‌ స్పెక్టర్‌ వసంతకుమార్‌, డీటీ సివిల్‌ సప్లయి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2026 | 11:46 PM