Share News

kumaram bheem asifabad-నిమజ్జనాల వేళ.. అప్రమత్తతే రక్ష

ABN , Publish Date - Sep 20 , 2026 | 10:28 PM

ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీతో పాటు జిల్లాలోని అన్ని గ్రామాల్లో వినాయక నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గణేశ్‌ నవరాత్రులు జరుగుతున్న పట్టణాలు, పల్లెల్లో ఉత్సా హభరిత వాతావరణం నెలకొంది. అయితే త్వరలోనే నిర్వహించే నిమజ్జన శోభాయాత్ర వేళ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ పట్టణాలతో పాటు ఆయా గ్రామాల్లో వేలాది వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. స్థానిక పెద్దవాగుతో పాటు ఆసిఫాబాద్‌లోని పెద్దవాగు, ఇతర గ్రామాల్లోని వాగులు, చెరువులలో నిమజ్జనానికి ఏర్పాటు చేస్తున్నారు

kumaram bheem asifabad-నిమజ్జనాల వేళ.. అప్రమత్తతే రక్ష
లోగో

- ప్రణాళికతోనే ప్రమాదాల నివారణ

కాగజ్‌నగర్‌ టౌన్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీతో పాటు జిల్లాలోని అన్ని గ్రామాల్లో వినాయక నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గణేశ్‌ నవరాత్రులు జరుగుతున్న పట్టణాలు, పల్లెల్లో ఉత్సా హభరిత వాతావరణం నెలకొంది. అయితే త్వరలోనే నిర్వహించే నిమజ్జన శోభాయాత్ర వేళ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ పట్టణాలతో పాటు ఆయా గ్రామాల్లో వేలాది వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. స్థానిక పెద్దవాగుతో పాటు ఆసిఫాబాద్‌లోని పెద్దవాగు, ఇతర గ్రామాల్లోని వాగులు, చెరువులలో నిమజ్జనానికి ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ యేట ఎక్కడోచోట నిమజ్జనం సమయంలో అపశృతులు దొర్లుతున్నాయి. విద్యుత్‌ షాక్‌తో పలు సంఘటనలు జరిగితే, వాగులు వంకల్లో మునిగి మృత్యువాత సంఘటనలున్నాయి. దీంతో పోలీసులు, మున్సిపల్‌, విద్యుత్‌తో పాటు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటు ఆయా మండళ్ల నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

- జాగ్రత్తలు ఇలా..

వినాయక విగ్రహాలను తరలించే వాహనాలు పటిష్టత సరిచూసుకోవాలి. అనుభవజ్ఞులైన డ్రైవర్లనే పెట్టుకోవాలి. మద్యానికి దూరంగా ఉండే వారిని ఎంచుకోవాలి. పోలీసుల సూచనలను పరిగణలోకి తీసుకొని నిర్ధేశిత మార్గాల ద్వారా మాత్రమే శోభా యాత్ర కొనసాగేలా చర్యలు తీసుకోవాలి. జనరేటర్‌ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పిల్లలను వాహనాలపై ఎక్కించవద్దు. ముఖ్యంగా యువకులు నిమజ్జనం జరిగే ప్రదేశాలైన వాగులు, వంకలు, చెరువులతో పాటు వాహనాలు వెళ్లేటప్పుడు, విద్యుత్‌ వైర్లు సమీపంలో సెల్ఫీ ఫొటోల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రమాదాలు జరిగే అవకాశా లుంటాయి. వేలాడే విద్యుత్‌, ఇతర తీగలు, చెట్ల కొమ్మలు సరిచేయాలివిగ్రహాలను తరలించేటప్పుడు వేలాడేతీగలు, చెట్ల కొమ్మల తగలకుండా చూసు కోవాలి. విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేసుకొనే వారు నాణ్యమైన విద్యుత్తు తీగలు సామగ్రిని మాత్రమే వాడాలి. విద్యుత్‌ శాఖ సూచనలను పరిగణలోకి తీసు కోవాలి. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే అందుబాటలో ఉండే విద్యుత్తు సిబ్బంది సహకారం తీసుకోవాలి. వాగుల సమీపంలో నిమజ్జనం కోసం వాగుల వద్ద గ జ ఈతగాళ్లకు మాత్రమే విగ్రహాలను అప్పగించాలి.

ఉత్సవ కమిటీలకు సూచనలు చేశాం..

- నితికాపంత్‌, ఎస్పీ

ఉత్సవ కమిటీలకు సూచనలు చేశాం. జిల్లా వ్యాప్తంగా గణేశ్‌ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పట్టిష్టమైన భద్రత చర్యలు చేపడు తున్నాం. ఇప్పటికే పలు మండపాలను సందర్శించి సూచనలు చేశాం. నిమజ్జనం కార్యక్రమాల్లో భాగంగా పెద్దవాగు నిమజ్జనం స్థలాన్ని పరిశీలించి జాగ్రత్తలు పాటించాలని ఆదేశించాం. శాంతియుతంగా ఉత్సవాలు జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలి.

Updated Date - Sep 20 , 2026 | 10:28 PM