Share News

kumaram bheem asifabad- పగణేశ్‌ మహారాజ్‌కీ జై

ABN , Publish Date - Sep 13 , 2026 | 11:30 PM

కుమరం భీం జిల్లాలో సోమవారం నిర్వహించే వినాయక చవితికి మండపాలు సిద్ధమయ్యాయి జిల్లా వ్యాప్తంగా గణేష్‌ ఉత్సవాల సందడి మొదలైంది. తొలిపూజలు అందుకునే గణపయ్యను కొలువు తీరేలా సర్వాంగ సుందరంగా మండపాలను సిద్ధం చేశారు. పట్టణాల నుంచి పల్లెల వరకు... చౌరస్తాల నుంచి గల్లీల వరకు తొమ్మిది రోజుల పాటు వినాయక సంబురాలతో భక్తులు తన్మయత్వం చెందనున్నారు.

kumaram bheem asifabad- పగణేశ్‌ మహారాజ్‌కీ జై
దారం రీళ్లతో తయారు చేస్తున్న లంబోదరుడి విగ్రహం

- నేడు కొలువు దీరనున్న గణనాథులు

కాగజ్‌నగర్‌ టౌన్‌, సెప్టెంబరు 13 (ఆంద్రజ్యోతి): కుమరం భీం జిల్లాలో సోమవారం నిర్వహించే వినాయక చవితికి మండపాలు సిద్ధమయ్యాయి జిల్లా వ్యాప్తంగా గణేష్‌ ఉత్సవాల సందడి మొదలైంది. తొలిపూజలు అందుకునే గణపయ్యను కొలువు తీరేలా సర్వాంగ సుందరంగా మండపాలను సిద్ధం చేశారు. పట్టణాల నుంచి పల్లెల వరకు... చౌరస్తాల నుంచి గల్లీల వరకు తొమ్మిది రోజుల పాటు వినాయక సంబురాలతో భక్తులు తన్మయత్వం చెందనున్నారు. సోమవారం ప్రారంభమయ్యే వినాయక సందడికి పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ముందుకు రావడంతో అశావాహూల సహాకారంతో మరింత ఉత్సాహాంగా యువకులు వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ రూపాల్లో ప్రత్యేకాకర్షణతో పాటు పర్యావరణ పరిరక్షణతో గణనాథులు కొలువు తీరేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతీ ఏడు లాగే ఈసారి కూడా పట్ణణంలోని ద్వారకానగర్‌, కాపువాడలోని భట్టు పల్లి చౌరస్తా, ద్వారకానగర్‌ కాలనీలో నిర్వాహకులు వివిధ రూపాల్లో వినాయకుల ప్రతిమలను ప్రతిష్టించారు. గతంలో ఆయా కాలనీల్లో వినాయక విగ్రహాలు భారీ అలంకరణలతో ఏర్పాటు చేశారు. ఈ సారి కూడా ఆయా కాలనీల్లో విగ్రహాలను భారీ ఎత్తున ఏర్పాటు చేసేందుకు కాలనీల యువకులు, ప్రజలు భక్తి శ్రద్ధలతో ఏర్పాట్లు చేశారు. దీంతో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేపట్టేందుకు కమిటీల నిర్వాహకులు సిద్దమయ్యారు.

- ద్వారకానగర్‌లోని..

ద్వారకానగర్‌లోని యువజన గణేశ్‌ మండలిలో యువకులు అంతా కలిసి ఏటా వినా యకుడి ప్రతిమను వివిధ రూపాల్లో తయారు చేస్తుంటారు. విగ్రహ తయారీ కర్త తేలి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఈ సారి దారం రీళ్లతో కూడా వినాయకుడిని ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేశారు. గతంలో అనేక రకాలైన వివిధ భంగిమళ్లో ఏర్పాటు చేశారు. ఈసారి కూడా ఆకట్టుకునేవిధంగా 15 రోజలు పాటు శ్రమించి 6,500 దారం రీళ్లతో భారీ విగ్రహాన్ని తయారు చేశారు. గణేష్‌ మండలి నిర్వహకులు అహర్నిశలు శ్రమించి పర్యావరణానికి ఇబ్బందులు కలుగకుండా ఏటా వినాయకున్ని ప్రతిష్టిస్తున్నారు. ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చేసే బహుమతుల పంపిణీలో పలుమా ర్లు ఉత్తమ అలంకరణ విగ్రహంగా గణేశుడు బహుమ తులు అందుకున్నట్లు నిర్వాహకుడు తేలి శ్రీనివాస్‌ తెలిపారు. ఈసారి కూడా పర్యావరణ పరిర క్షణలో భాగంగా ఎలాంటి ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, తది తర రంగులు వాడకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు.

- రూపాయి బిళ్లలతో..

ద్వారాకానగర్‌లోని గణేశ్‌ మండలిలో ఈ సంవ త్సరం కూడా ప్రత్యేకతలు కలిగినటువంటి విగ్రహం ఏర్పాటు చేశారు. గతంలో సముద్రపు శంఖులు, పల్లకీ వాహనంలో గణేషుడు, కొబ్బరి కాయల వినాయకుడిని నెలకొల్పగా ఈసారి 5, 2, 1, 50 పైసల కొత్త బిళ్లలను యాదాద్రి దేవస్థానం నుంచి తెప్పించి ఆరడుగుల విగ్రహం తయారు చేశారు. కేవలం రూపాయి బిళ్లలతో అత్యంత ఆకర్షణీయంగా తీర్చి దిద్దినటువంటి విఘ్నేశ్వరున్ని మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం కోసం సుమారు రూపాయి 15016 రూపాయల విలువ గల బిళ్లలు ఇతరత్ర వస్తువులతో దేదీప్యమానంగా వెలిగేందుకు ఆకర్షణీయంగా తయా రు చేశారు. గత 25 ఏండ్లుగా ప్రతిష్టిస్తున్నట్లు బంక నరేష్‌, శీలం రాజన్న, కొండ మహేష్‌ నిర్వాహకులు తెలిపారు. కాగా స్థానిక కాపువాడలోని బట్టుపల్లి చౌరస్తాలో విఘ్నే శ్వరుడి ప్రతిష్టించేందుకు నిర్వాహ కులు సుమన్‌, సాయి, వినోద్‌, మహేష్‌, విక్రమ్‌ తదితర కాలనీ యువకులు అంతా రాజ్‌మా గింజలతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గింజలతో ఏర్పాటు చేస్తు న్న వినాయకుడిని నెలకొల్పేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 25 ఏళ్ల్లుగా ప్రత్యేకతలతో కూడిన విగ్రహం తయారు చేసి పూజలు నిర్వహిస్తున్నారు.

Updated Date - Sep 13 , 2026 | 11:30 PM