kumaram bheem asifabad- విజయోస్తు..
ABN , Publish Date - Mar 13 , 2026 | 10:11 PM
జిల్లాలో శనివారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. ఐదు నిమిషాల వరకు ఆలస్యంగా చేరుకునే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిం చనున్నారు. కా
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
- జిల్లాలో 38 కేంద్రాల ఏర్పాటు
- హాజరుకానున్న 6,949 మంది విద్యార్థులు
ఆసిఫాబాద్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) జిల్లాలో శనివారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. ఐదు నిమిషాల వరకు ఆలస్యంగా చేరుకునే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిం చనున్నారు. కానీ పరీక్ష సమయానికి అరగంట ముందుగానే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలను సులభంగా తెలుసుకునేందుకు హాల్‌టికెట్‌పై క్యూఆర్ కోడ్ ముద్రించారు. ఆన్‌లైన్‌లో కూడా హాల్ టిటెట్ డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఏప్రిల్ 16 వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాల కల్పించాలరు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కె హరిత జిల్లా విద్యాశాఖాధికారులను ఇది వరకే ఆదేశించారు.
- జిల్లా వ్యాప్తంగా..
పదో తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 38 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 35 రెగ్యులర్, మూడు ప్రైవేటు కేంద్రాలున్నాయి. జిల్లాలో 6,949 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో బాలురు 3,204 మంది. బాలికలు 3,745 మంది పరిక్షలు రాయనున్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకార్యలు కలగకుండా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలల సౌకర్యం వంటి ఏర్పాట్లు సిద్ధం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మందులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష రాసేందుకు గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ బస్సులు నడపాలని కలెక్టర్ ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
- పకడ్బందీ ఏర్పాట్లు..
పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇది వరకే కలెక్టర్ హరిత సంబంధిత అధికారులను ఆదేశించడంతో తగిన ఏర్పాట్లు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 38 కేంద్రాలను ఏర్పాటు చేయగా 38 మంది ఛీప్ సూపరింటెండెంట్‌లు, 38 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు 500 మంది ఇన్విజిలేటర్లును నియమించారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద వివిధ శాఖల అధికారులతో సిట్టింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీరే కాకుండా రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృంధాలు ఎప్పటికప్పుడు జిల్లాలో పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తుంటాయి. విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్ 9908556117 కూడా ఏర్పాటు చేశారు. పరీక్షల సమయంలో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. దీంతో కేంద్రాల వద్ద గుంపులుగా తిరిగేందుకు అవకాశం లేదు. పరీక్ష సమయం వరక జిరాక్స్ కేంద్రాలను కూడా మూసి ఉంచాలని ఆదేశించారు. పరీక్షల సమయంలో కేంద్రాల ముఖ్య పర్యవేక్షకులు, డిపార్టుమెంట్ అధికారులు, ఇన్విజిలేటర్లు, విద్యార్థులు సెల్‌ఫోన్ తీసుకచ్చేందుకు అనుమతి లేదు. విద్యార్థులు ఎలకా్ట్రనిక్ వస్తువులు, క్యాలికులేటర్ వంటివి పరీక్ష కేంద్రానికి తీసుకు రాకూడదని ఆదేశాలు ఇచ్చారు.