Share News

kumaram bheem asifabad- బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి

ABN , Publish Date - Feb 23 , 2026 | 10:39 PM

బాధివతులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ నితికా పంత్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించారు.

kumaram bheem asifabad- బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి
ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎస్పీ నితికా పంత్‌

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): బాధివతులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ నితికా పంత్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదవుదారుల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత డీఎస్పీ, ఏఎస్పీ, సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి సమస్య స్థితిని పరిష్కారానికి సూచించారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీసు సేవలను వినియోగించుకోవాలన్నారు. వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా పోలీసులు, ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ పని చేస్తుందని ఎస్పీ తెలియజేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులుగా నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని అన్నారు. బాధితులు, సమస్యలు ఉన్న వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, వారు పట్టుబడితే యజమానులపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ నితికా పంత్‌ అన్నారు. స్థానికంగా సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వాహన యజమానులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని చెప్పారు. మైనర్‌ వాహనం నడిపినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఈ ప్రమాదాలు వాహన యజమాని తో పాటు ఇతర వ్యక్తులకు కూడా నష్టం కలిగించే అవకాశముందని అన్నారు. లైసెన్సు, నంబర్‌ ప్లేట్‌ లేకుండా తప్పుడు నంబర్లు, శబ్ద కాలుష్యం నడిచే వాహనదారులపై చర్యలు తీసుకుంటామన్నారు. రాంగ్‌ సైడ్‌ పార్కింగ్‌, మొబైల్‌ పోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం, బాధ్యతారహిత్యంగా ఓవర్‌ లోడెడ్‌ వాహనాలు నడపడం వంటి నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Feb 23 , 2026 | 10:39 PM