Share News

బీసీలు ఓట్లేసే మిషన్లా?: వీహెచ్‌

ABN , Publish Date - Apr 07 , 2026 | 05:48 AM

బీసీలు కేవలం ఓట్లేసే మిషన్లు మాత్రమేనా..? అధికారం చేపట్టడానికి పనికి రారా..? జన గణనలో కుల గణను కేంద్రం ఎందుకు చేపట్టట్లేదు...

బీసీలు ఓట్లేసే మిషన్లా?: వీహెచ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): ‘బీసీలు కేవలం ఓట్లేసే మిషన్లు మాత్రమేనా..? అధికారం చేపట్టడానికి పనికి రారా..? జన గణనలో కుల గణను కేంద్రం ఎందుకు చేపట్టట్లేదు?.. ఇందులో బీసీల ప్రస్తావనెందుకు లేదు?’ అని ప్రధాని నరేంద్రమోదీని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ హన్మంతరావు నిలదీశారు. ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ వద్ద మోదీ రిమోట్‌ కంట్రోల్‌ ఉందని గాంధీ భవన్‌లో మీడియాతో చెప్పారు. దేశాన్ని ముక్కలు చేయడమే ఆర్‌ఎ్‌సఎస్‌ ఆలోచన అన్నారు. జన గణనలో మోదీ కుట్రను రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల్లో తాను ప్రచారం చేస్తామన్నారు. రాహుల్‌ గాంధీ ప్రధాని కాగానే దేశంలో కుల గణన చేస్తారన్నారు.

Updated Date - Apr 07 , 2026 | 05:48 AM