Share News

kumaram bheem asifabad-పశువైద్యం.. కడుదైన్యం

ABN , Publish Date - Oct 01 , 2026 | 10:42 PM

జిల్లాలోని పశువైద్యశాలలల్లో వైద్యులు, సరిపడా సిబ్బంది లేక రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పశుపోషణ పై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులకు పశువైద్య సేవలు సకాలంలో అందక ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. పశువైద్య కేంద్రాల్లో కొన్నేళ్లుగా వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పశువులకు అత్య వసర వైద్యం అందించడంలో జాప్యం జరుగుతోం దని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

kumaram bheem asifabad-పశువైద్యం.. కడుదైన్యం
లోగో

- పట్టించుకోని ఉన్నతాధికారులు

వాంకిడి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పశువైద్యశాలలల్లో వైద్యులు, సరిపడా సిబ్బంది లేక రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పశుపోషణ పై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులకు పశువైద్య సేవలు సకాలంలో అందక ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. పశువైద్య కేంద్రాల్లో కొన్నేళ్లుగా వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పశువులకు అత్య వసర వైద్యం అందించడంలో జాప్యం జరుగుతోం దని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం సిబ్బందే వైద్య సేవలు అందిస్తుండటంతో పలువురు నాటువైద్యంపై ఆధారపడుతున్నారు. దీంతో పాటు పశువైద్యశాల భవనాలు శిథిలం కాగా కొన్నింటికి సొంత భవనాలు లేక ఇబ్బందులు తప్పడంలేదు. వర్షాకాలంలో శిథిలా వస్థకు చేరిన భవనాల్లో వర్షం పడినప్పుడల్లాగదుల్లో నీరు ఊరుస్తుండడంలో ఇబ్బందులు పడుతున్నారు. తిర్యాణి మండలం గిన్నెధరి గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉన్పప్పుడు పశువైద్యశాలకు సొంత భవనం మంజూరైంది. స్లాబ్‌ లెవల్‌వరకు నిర్మాణం కాగా అప్పటి నుంచి అసంపూర్తిగా అలాగే ఉంటుంది. ఇక్కడ వైద్యశాల లేకపోవడంతో ఇక్కడి పశువైద్యాధికారిని మరో చోటుకు పంపారు. దీంతో పశపోశకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దహేగాం మండల కేంద్రంలో నూతన భవనం అసంపూర్తిగా ఉండడంతో పాత పాఠవాల భవనం లో పశువైద్యశాల కొనసాగిస్తున్నారు. కొత్త మండలా ల్లో పశువైద్యశాలలు లేక మండల వాసులు సమీపంలోని మండలాలకు పశువులను తీసుకెళ్లి వైద్యం చేయించాల్సిన పరిస్థితి నెలకొంది. వాంకిడి మండల కేంద్రంలోని ఏడీ కార్యాలయం ఉండగా ఏడీ పోస్టు ఖాళీగా ఉంది. సిబ్బంది మాత్రమే వైద్య సేవలు అందిస్తున్నారు.

- జిల్లాలో పరిస్థితి ఇలా..

జిల్లాలో 19 పశువైద్యశాలలు, 11 సబ్‌ సెంటర్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 11 మంది పశువైధ్యాధికారులు మాత్రమే ఉన్నారు. ఆరు వైద్యశాలల్లో సిబ్బంది లేరు. కొన్నిచోట్ల ఔట్‌సోర్సింగ్‌ వైద్యులను నియమించారు. 17 మంది వెటర్నీ అసిస్టెంట్లు ఉండగా అయిదు ఖాళీలు ఉన్నాయి. 34 మంది అ టెండర్లు ఉండాల్సి ఉండగా 23 మంది పనిచేసు ్తన్నారు. ఒక్కొక్క వైద్యాధికారి రెండు మూడు పశువైద్యశాలలకు ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్నా రు. దీంతో ఎక్కడా సరైన వైద్యం అందించలేని దుస్థితి ఏర్పడింది. వైధ్యాధికారుల ఖాళీలు ఉన్నచోట సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు.

ఖాళీలను భర్తీ చేయాలి..

- అజయ్‌కుమార్‌, మాజీ జడ్పీటీసీ

జిల్లాలో పశువైద్యాధికారులు, సిబ్బంది పోస్టులు ఖాళీలను భరీ చేయాలి. సిబ్బంది లేక పోవడంతో పశువైద్య శాలల్లో పశువులకు సక్రమంగా వైద్యం అందడంలేదు. వైద్యశాలల్లో సిబ్బంది విధులకు సకాలంలో హాజరుకావడంలేదు. ఏమైన సమస్యలతో రైతులకు పశువులను వైద్యశాలలకు తీసుకువెళ్తే గంటల తరబడి సిబ్బంది వచ్చే వరకు వేచి ఉండా ల్సి వస్తుంది. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.

పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపిచాం..

సురేష్‌, జిల్లా పశువైద్యాధికారి

జిల్లాలో ఖాళీగా ఉన్న పశు వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీ కోసం ప్రతిపాదనలు పంపించాం. శిథిలమైన భవనాల విషయంలో ప్రభుత్వానికి నివేదికలు అందజేశాం. జిల్లాల్లో పశువులకు సకా లంలో వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటాం.

Updated Date - Oct 01 , 2026 | 10:42 PM