Share News

సౌర విద్యుత్‌తో ఎంతో మేలు

ABN , Publish Date - Mar 24 , 2026 | 10:10 PM

సౌర విద్యుత్‌తో ఎంతో మేలు కలుగుతుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ కార్యాలయం ఆవరణలో ప్రధానమంత్రి సూ ర్యఘర్‌ ముప్త్‌ బిజిలి యోజన ప్రచార వాహనాన్ని ప్రారంభించారు.

సౌర విద్యుత్‌తో ఎంతో మేలు
వాహనాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : సౌర విద్యుత్‌తో ఎంతో మేలు కలుగుతుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ కార్యాలయం ఆవరణలో ప్రధానమంత్రి సూ ర్యఘర్‌ ముప్త్‌ బిజిలి యోజన ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా గృహ వి ద్యుత్‌ వినియోగదారులు తమ ఇళ్ల రూఫ్‌ టాప్‌పై సోలార్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకుని ప్రతి నెల 360 యూనిట్ల వరకు విద్యుత్‌ పొంద వచ్చన్నారు. దేశ వ్యాప్తంగా కోటి కుటుంబాలకు లబ్ది చేకూర్చడమే ల క్ష్యంగా పథకం అమలు చేస్తామన్నారు. కిలోవాట్‌కు రూ. 30 వేలు, 2 కిలోవాట్‌లకు రూ. 60 వేలు రాయితీ కాగా రూ. 18 వేల వరకు ప్రతి కిలో వాట్‌కు, జీహెచ్‌ఎస్‌, ఆర్‌డబ్య్లూఎ కోసం 500 కిలోవాట్ల రాయితీ అందుబాటులో ఉంటుందన్నారు. 3 కిలోవాట్లు అంతకంటే ఎక్కువ విద్యుత్‌కు రూ. 78 వేలు రాయితీ కాగా రాయితీ మొత్తం నేరుగా వి నియోగదారుల బ్యాంకు ఖాతాలో జమవుతుందన్నారు. సోలార్‌ ద్వా రా నెలవారి వినియోగం, విద్యుత్‌ బిల్లులు, కాలుష్యం తగ్గించుకోవ చ్చని, మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేస్తే నెట్‌ మీటరింగ్‌ ద్వా రా డిస్కం నుంచి అదనపు ఆదాయాన్ని పొందచవ్చన్నారు. ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వి ద్యుత్‌ అధికారులు శ్రీనివాస్‌, రాజన్న, మల్లేశం, మోహన్‌రెడ్డి, రాజ శేఖర్‌, కలెక్టరేట్‌ పరిపాలన అధికారి రాజేశ్వర్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2026 | 10:10 PM