ఫొటో జర్నలిస్టులు ప్రజాస్వామ్యానికి కళ్లు
ABN , Publish Date - Apr 06 , 2026 | 05:23 AM
జర్నలిజం ఒక మహావృక్షమైతే, దానికి ఫొటో జర్నలిస్టులు ప్రాణం లాంటి వారని, ప్రజాస్వామ్యానికి కళ్ల వంటివారని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చెప్పారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
హైదరాబాద్, అఫ్జల్‌గంజ్, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): జర్నలిజం ఒక మహావృక్షమైతే, దానికి ఫొటో జర్నలిస్టులు ప్రాణం లాంటి వారని, ప్రజాస్వామ్యానికి కళ్ల వంటివారని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చెప్పారు. ఏ భాషతో సంబంధం లేకుండా ఉండేది కేవలం ఫోటోగ్రఫీ మాత్రమేనని, వంద మాటల పెట్టు ఒక ఫోటో రూపమన్నారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ కార్యాలయ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘23వ ఉత్తమ ఫోటో జర్నలిస్ట్- 2025 అవార్డుల ప్రదానోత్సవ’ కార్యక్రమానికి సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు అనుమళ్ల గంగాధర్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా వెంకయ్య హాజరయ్యారు. రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఎఐ రంగంలో ఫోటో జర్నలిస్టులు ఎలా ముందుకెళ్లాలో చర్చించుకునేందుకు ఓ సారి సమావేశమవ్వాలని సూచించారు.