క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వెంకటస్వామి మెమోరియల్
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:42 PM
పట్టణ, గ్రామీణ ప్రాం తంలో ఉన్న క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ క్రి కెట్ అసోసియేషన్, విశాఖ ఇండస్ర్టీస్ ఆధ్వర్యంలో దివంగత కాకా వెం కటస్వామి మెమోరియల్ క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక ఉపాధికల్పన గనులశాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు.
మందమర్రిటౌన్, జనవరి10(ఆంధ్రజ్యోతి): పట్టణ, గ్రామీణ ప్రాం తంలో ఉన్న క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ క్రి కెట్ అసోసియేషన్, విశాఖ ఇండస్ర్టీస్ ఆధ్వర్యంలో దివంగత కాకా వెం కటస్వామి మెమోరియల్ క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక ఉపాధికల్పన గనులశాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. శనివారం వరంగల్‌లో జరుగుతున్న కాకా మెమోరియల్ టి20 క్రికెట్ లీగ్ సెకండ్ ఫేజ్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హా జరయ్యారు. ఈసందర్భంగా ఆయన క్రీడాకారులకు కరచాలనం అం దించి పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు హైదరాబాద్ కేంద్రంగానే ఐపీఎల్ పోటీలు జరిగాయ న్నారు. జిల్లాలకు పెద్దగా ప్రాధాన్యత దక్కగపోయేదని తెలిపారు. తాను హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో మారుమూల గ్రామీ ణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర స్థాయిలో రాణించే లక్ష్యం గా తెలంగాణ క్రికెట్‌లీగ్ పోటీలు ఏర్పాటు చేశానన్నారు. గతంలో ఆ పోటీలు నిర్వహించిన సమయంలో గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విజయం సాధించిందన్నారు. ఆ తరువాత మరిన్ని పోటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించా లనే సంకల్పంతో తమ తండ్రి పేరిట మెమోరియల్ పోటీలు ప్రారంభిం చామని తెలిపారు. ఈ పోటీలు ఐపీఎల్ తరహాలో జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి మ్యాచ్‌ను 20 నుంచి30వేల మంది వీక్షిస్తున్నారన్నారు. అనంతరం హైదరాబాద్ వరంగల్ జట్ల సంబంధించి టాస్‌వేసి పోటీల ను ప్రారంభించారు. కొంత సేపు బౌలింగ్, బ్యాటింగ్ చేసి అలరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజ్‌సారయ్య, వరంగల్ క్రికెట్ అసోసి యేషన్ అధ్యక్షుడు పెద్ది ప్రవీణ్‌గౌడ్‌లు పాల్గొన్నారు.