kumaram bheem asifabad- వెంకన్న చెంత.. సమస్యల చింత
ABN , Publish Date - Jan 13 , 2026 | 10:12 PM
రెబ్బెన మండలం గంగాపూర గ్రామ శివారులో చారిత్రాత్మక ప్రాధాన్యం గల బాలాజీ వేకంటేశ్వరస్వామి ఆలయంలో సమస్యలు నెలకొన్నాయి. ఏటా మాఘశుద్ధ పౌర్ణమిని పురసకరించుకొని గంగాపూర్ ఆలయంలో మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మొక్కులు చెల్లించుకోవడంతో పాటు కట్కకానుకలను హుండీలో వేస్తుంటారు. ఏటా జాతర వేలం ద్వారా, హుండీ ద్వారా లక్షల్లో ఆదాయం వస్తున్నప్పటికీ ఆలయ అభివృద్ధికి ఏ మాతరం జరగడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- వాగులో దారి సరిగా లేక భక్తుల అవస్థలు
- అధికారులు చర్యలు తీసుకోవాలని వినతి
రెబ్బెన, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): రెబ్బెన మండలం గంగాపూర గ్రామ శివారులో చారిత్రాత్మక ప్రాధాన్యం గల బాలాజీ వేకంటేశ్వరస్వామి ఆలయంలో సమస్యలు నెలకొన్నాయి. ఏటా మాఘశుద్ధ పౌర్ణమిని పురసకరించుకొని గంగాపూర్ ఆలయంలో మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మొక్కులు చెల్లించుకోవడంతో పాటు కట్కకానుకలను హుండీలో వేస్తుంటారు. ఏటా జాతర వేలం ద్వారా, హుండీ ద్వారా లక్షల్లో ఆదాయం వస్తున్నప్పటికీ ఆలయ అభివృద్ధికి ఏ మాతరం జరగడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అభివృద్ధిపై అధికార యంత్రాంగానికి ఏ మాత్రం పట్టింపులేదని చెబుతున్నారు. చారిత్రక ప్రాధాన్యం గల ఆలయం కావడంతో ఇక్కడ పరతి శని, సోమవారం అన్నదాన కార్యక్రమాలు కూడా భక్తులు చేపడుతుంటారు. మిగితా రోజుల్లో కూడా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వచ్చి మొకుకలు సమర్పించుకుంటారు. కానీ ఆలయం గట్లపై ఉంటుంది. దీంతో పాటు ఆలయం ముందు గంగాపూర్ వాగు ప్రవహిస్తోంది. గతంలో రాక పోకలు సరిగ్గా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు రాలేదు. నాలుగేళ్ల కిత్రం ఆలయానికి కొద్ది దూరంలో గంగాపూర్ చెక్ డ్యాం నిర్మించారు. దీంతో వర్షాకాలం చెక్ డ్యాం నుంచి వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో భక్తులు వాగు దాటి స్వామి వారి దర్శనానికి వెళ్లడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఏడాది పొడువున వాగు ప్రవహిస్తుండడంతో పిల్లలు, వృద్ధులు అందులోంచి నడిచి వెళ్లడనికి ఇబ్బందికరంగా ఉందనే ఉద్దేశంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రెండేళ్ల క్రితం రోడ్డు నిర్మాణం చేపట్టారు. వరద తాకిడికి కొట్టుక పోవడంతో భక్తులు ఇబ్బందులు అలాగే కొనసాగుతున్నాయి. అధికారులు ప్రజాప్రతిని ధులు జాతరకు వచ్చే వారి కోసం సరైన దారిని ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.
కలగానే కల్యాణ మండపం..
ఆలయ పరిసరాల్లో కల్యాణ మండలం నిర్మాణం కలగానే మగిలింది. జాతర సందర్భంగ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయం ముందు వేంకటేశ్వర స్వామి, పద్మావతి, అలివేలు మంగ కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ మహోత్సవం జరిపించేందుకు ఆలయం వద్ద ఏటా తాత్కాలిక టెంట్లు వేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కానీ దీనికి కల్యాణ మండపం నిర్మించాలనే ఉద్దేశంతో గతంలో రూ.25 లక్షల నిధులు మంజూరైనా పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. దాతల సహకారంతో సిమెంట్ పనులను మాత్రం పూర్తి చేశారు. రెబ్బెన మండలం కేంద్రం నుంచి గంగాపూర్ ఆలయం వరకు సింగిల రోడ్డు ఉండడంతో భక్తులు రాక పోకల సందర్భంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డుకు నిధులను మంజూరు చేయించి డబుల్ రోడ్డుగా మారిస్తే జాతర సందర్భంగా రాక పోకలకు ఎలాంటి అసౌకర్యం ఉండదని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.