Share News

వెంకయ్యనాయుడితో నితిన్‌ నబీన్‌ భేటీ

ABN , Publish Date - May 27 , 2026 | 05:25 AM

మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ భేటీ అయ్యారు. ప్రస్తుతంఅటల్‌ స్మృతి న్యాస్‌ సొసైటీ ...

వెంకయ్యనాయుడితో నితిన్‌ నబీన్‌ భేటీ

న్యూఢిల్లీ, మే 26(ఆంధ్రజ్యోతి): మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ భేటీ అయ్యారు. ప్రస్తుతంఅటల్‌ స్మృతి న్యాస్‌ సొసైటీ చైర్మన్‌గా ఉన్న వెంకయ్యనాయుడును మంగళవారం ఆయన నివాసంలో నితిన్‌ నబీన్‌ కలుసుకున్నారు.. మాజీ ప్రధాని వాజ్‌పేయి వారసత్వాన్ని సంరక్షించడం, ఆయన జీవితాన్ని, విలువలను, దేశానికి అందించిన సేవలను గౌరవించడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్న ఈ సొసైటీ చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. డిసెంబర్‌ 2025 నుంచి వెంకయ్యనాయుడు ఈ సొసైటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న విషయం విదితమే.

Updated Date - May 27 , 2026 | 05:25 AM