పోలీసుల మనోభావాలను దెబ్బతీస్తావా?
ABN , Publish Date - May 22 , 2026 | 04:43 AM
బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పోలీసుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆర్‌ఎస్ ప్రవీణ్‌పై వేముల వీరేశం ధ్వజం
హైదరాబాద్, మే 21(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పోలీసుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన పోలీస్ ఎలా అయ్యారని ప్రశ్నించారు. బండి భగీరథ్ అరెస్టు విషయంలో పోలీసులు చెప్పేది వినకుండా రాజకీయ నేతలు చెప్పే విషయాలను నమ్మే దీన స్థితిలో ఆర్‌ఎస్ ప్రవీణ్ ఉన్నారని విమర్శించారు. బండి భగీరథ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైన తర్వాతే బీఆర్‌ఎస్ ఈ అంశంపైన మాట్లాడిందని తెలిపారు. కానీ.. తామే కేసును వెలికి తీసినట్లు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.