వాహనాలు కండీషన్‌లో ఉండాలి
ABN , Publish Date - Oct 06 , 2026 | 11:32 PM
నాగర్‌కర్నూ ల్ ఎస్పీ ఆఫీస్‌లో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్న ఇన్నోవా వాహనాలను ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్‌జీ పాటి ల్ మంగళవారం పరిశీలించా రు.
- పోలీసు వాహనాలను తనిఖీ చేసిన ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్
నాగర్‌కర్నూల్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూ ల్ ఎస్పీ ఆఫీస్‌లో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్న ఇన్నోవా వాహనాలను ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్‌జీ పాటి ల్ మంగళవారం పరిశీలించా రు. వాహనాల కండీషన్ గు రించి డ్రైవర్లను అడిగితెలుసు కుని ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే సరి చేసుకోవాలని డ్రైవర్లకు సూచిం చారు. అలాగే ప్రతీ డ్రైవర్‌కు నెలకొక సారి మె డికల్ ఫిట్‌నెతో పాటు కంటి పరీక్ష చేయించా లని పోలీస్ ట్రాన్స్‌పోర్టు అధికారి రాఘవరా వుకు సూచించారు. ఎవరైనా డ్రైవర్లు అనారో గ్యంగా ఉంటే వారిని తప్పించి కొత్త డ్రైవర్లకు ట్రైనింగ్ ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంటీవో ఆర్‌ఐ రాఘవరావు, జగన్, ఎస్‌బీ ఎస్‌ఐ శ్రీనివాసులు, ఆర్‌ఎస్‌ఐ గౌస్ పాషా, వాహనాల మెకానిక్‌తో పాటు జిల్లాలో ఉన్న డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.