kumaram bheem asifabad- వేసవిలో వాహనం జాగ్రత్త
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:24 PM
వేసవిలో వాహనాలను ఎండలో పార్కింగ్ చేయడంతో జరిగే ప్రమాదాలు ముందుగా తెలుసుకోవడంతో పాటు ధన, ప్రాణ నష్టాలు కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో మనకు వడ దెబ్బ తగులకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఎండగా అనిపించగానే నీడ ఉన్న ప్రదేశానికి వెంటనే చేరుకుంటాం. ఇలానే మనం వినియోగించుకునే వాహనాలను సైతం ఎల్లప్పుడూ నీడ ఉన్న ప్రదేశాల్లోనే పార్కింగ్ చేయాలి. ఇలా చేయడంతో రంగుతో పాటు ఇంధనం ఆవిరి కాదు
సిర్పూర్(టి), మార్చి 4 (ఆంధ్రజ్యోతి): వేసవిలో వాహనాలను ఎండలో పార్కింగ్ చేయడంతో జరిగే ప్రమాదాలు ముందుగా తెలుసుకోవడంతో పాటు ధన, ప్రాణ నష్టాలు కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో మనకు వడ దెబ్బ తగులకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఎండగా అనిపించగానే నీడ ఉన్న ప్రదేశానికి వెంటనే చేరుకుంటాం. ఇలానే మనం వినియోగించుకునే వాహనాలను సైతం ఎల్లప్పుడూ నీడ ఉన్న ప్రదేశాల్లోనే పార్కింగ్ చేయాలి. ఇలా చేయడంతో రంగుతో పాటు ఇంధనం ఆవిరి కాదు. వాహనం సురక్షితంగా ఉంటుంది. . ఇటీవల మార్కెట్‌లో కొత్తగా వచ్చిన విద్యుత్ బ్యాటరీ వాహనాలు అయితే అస్సలు ఎండలో ఉంచకూడదని నీడలో ఉంచాలని చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రీకల్ వాహనాలు కాలి పోయి బుడిదవుతాయని చెబుతున్నారు. మార్చి, ఏప్రిల్, మే నెలలో ఈ జాగ్రత్తలు పాటిస్తే బాగుటుందని సూచిస్తున్నరు.
- దూర ప్రయాణం వద్దు..
కొంతమంది బైక్‌లపై దూర ప్రయాణం చేయడానికి ఇష్టపడుతారు. వేసవి కాలంలో ఈ రకం ప్రయాణం చాలా ప్రమాదకరం. రోడ్డుతో పాటు పరిసర ప్రాంతాలు ఎండతో వేడెక్కిపోతాయి. దీంతో బైక్‌ల ఇంజిన్, టైర్లు త్వరగా వేడెక్కుతాయి. కొన్ని సందర్భాల్లో టైర్లు పేలిపోయి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లవచ్చు. బైక్‌పైనే వెళ్లాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాత్రం మార్గమధ్యలో చల్లటి ప్రదేశాలు చూసుకుని ఆగాలి. కాస్తత విశ్రాంతి తీసుకుని ముందకు వెళ్లడం ప్రయోజనకరం.
- ఇంజిన్ ఆయిల్..
ఎండలో వాహనాల ఇంజిన్ ఆయిల్ తొందరగా వేడెక్కి పలుచనవుతుంది. వేసవి కాలం ప్రారంభంలోనే వాహనాల ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలి. ట్యాంక్‌పై మందంగా ఉన్న కవర్‌ను ఏర్పాటు చేసుకోవడంతో పెట్రోల్ ఆవిరి కాకుండా కాపాడుకోవచ్చు. అరిగి ఉన్న టైర్లు, పంక్చర్లు ఉన్న ట్యూబులు ఉంటే వెంటనే మార్చుకోవాలి. ఎండలో ఎక్కువ సమయం వాహనాలు ఉంచడంతో రంగు వెలిసి పోవడంతో పాటు వాహన జీవిత కాలం క్రమేపీ తగ్గుతుంది. వేసవి తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల సమయంలో బైక్‌పై ప్రయాణం చేయక పోవడం చాలా మంచింది.