వీబీ జీరాంజీ బిల్లును రద్దు చేయాలి
ABN , Publish Date - Mar 12 , 2026 | 11:10 PM
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తు న్న వీజీ జీరాంజీ బిల్లును రద్దు చేసి, మ హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని సీపీఎం జిల్లా నాయకుడు ఎల్ దేశానాయక్ డిమాండ్ చేశారు.
- సీపీఎం జిల్లా నాయకుడు దేశ్యా నాయక్
ఉప్పునుంతల, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తు న్న వీజీ జీరాంజీ బిల్లును రద్దు చేసి, మ హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని సీపీఎం జిల్లా నాయకుడు ఎల్ దేశానాయక్ డిమాండ్ చేశారు. గురువారం మండల పరిధిలోని మొల్గర గ్రామంలో ఉపాధిహామీ కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చింతల నాగరాజు, జిల్లా కమిటీ సభ్యులు సైదులు, సాయిలు ఈశ్వరయ్య, వెంకటేస్, చంద్రయ్య, లక్ష్మయ్య, శివమ్మ, ఉన్నారు.
ఫ కోడేరు, (ఆంధ్రజ్యోతి) : వీబీ జీరామ్‌జీ బిల్లును తక్షణమే రద్దు చేసి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని కొన సాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల పరిధిలోని కోండ్రావుపల్లి, నర్సాయిపల్లి తదితర గ్రామాలలో ఆయన ఉపాధిహామీ పథ కం కింద పని చేస్తున్న కూలీలను క్షేత్రస్థాయి లో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు రాములు, రాంకు మార్‌గౌడ్, శివయ్య, అర్చనగౌడ్, రామకృష్ణగౌడ్, కురుమయ్య పాల్గొన్నారు.