భక్తిశ్రద్ధలతో వాసవీమాత ఆత్మార్పణ దినోత్సవం
ABN , Publish Date - Jan 20 , 2026 | 11:24 PM
కల్వకుర్తి పట్టణంలోని వాసవీకన్యకా ప రమేశ్వరి దేవాలయంలో వాస వీమాత ఆత్మార్ప ణ దినోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
కల్వకుర్తి/అమ్రాబాద్, జనవరి20 (ఆంధ్రజ్యో తి) : కల్వకుర్తి పట్టణంలోని వాసవీకన్యకా ప రమేశ్వరి దేవాలయంలో వాస వీమాత ఆత్మార్ప ణ దినోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆ లయ ఫౌండర్ ట్రస్టు చైర్మన్ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుండే వాసవీమాతకు అభిషేకాలు, కుంకుమా ర్చన నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహా న్ని పల్లకిలో ఊరేగించారు. మహిళా భక్తులకు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు బచ్చు రామకృ ష్ణ, ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు వాస శేఖర్, వాసవీ క్లబ్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ చిగుళ్లపల్లి శ్రీధర్, ఆర్యవై శ్య సంఘం, వాసవీ క్లబ్, వనిత క్లబ్, ఆవోపా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఫ అమ్రాబాద్‌లో వాసవీకన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకొని ఆర్యవై శ్యులు మంగళవారం హోమం నిర్వహించి ప్ర త్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా, మండల నాయకులు సంబు వెంకటరమణ, జూలూరి సత్యనారాయణ, నీల శ్రీనివాసులు, మాల శంకరయ్య, పాపిశెట్టి భాగ్య లక్ష్మి, శ్యాంసుందర్, కొండయ్య, సురేష్‌కుమార్ పాల్గొన్నారు.