kumaram bheem asifabad-భక్తిశ్రద్ధలతో వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి
ABN , Publish Date - Apr 26 , 2026 | 11:02 PM
జిల్లాలో వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతిని ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బెజ్జూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న వాసవీమాత ఆలయంలో ఆర్యవైశ్య సంఘం అధ్వర్యంలో వాసవీమాత జయంతిని ఘనంగా జరుపుకున్నారు
బెజ్జూరు, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతిని ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బెజ్జూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న వాసవీమాత ఆలయంలో ఆర్యవైశ్య సంఘం అధ్వర్యంలో వాసవీమాత జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు వాసవిమాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు శ్రీవర్థన్, రమేష్, గోపాల్, సతీష్, నగేష్, నీలేష్, సంతోష్, మహిళ నాయకురాళ్లు అంజమ్మ, సరస్వతి, మాయ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, (ఆంధ్రజ్యోతి): వాసవీమాత జయంతి వేడుకలను ఆలయ అభివృద్ది కమిటీ వాసవిక్లబ్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం పట్టణంలోని శ్రీ వాసవీ కన్యాకాపరమేశ్వరి ఆలయంలో అర్చకులు రాజశేఖరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవీమాత విగ్రహనికి అబిషేకం నిర్వహించి కుంకుమపూజ నిర్వహించారు. సాయంత్రం పట్టణంలోని పలు విదుల గుండా మహిళల కోలాటం నడుమ అమ్మవారి ఉత్సవ విగ్రహంతో శోభాయాత్ర నిర్వహించారు. అంతకు ముందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అలయ అభివృద్ది కమిటీ సభ్యులు శంకర్, వెంకన్న, మురళీ, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ప్రమోద్, ప్రశాంత్, విజయ్, వేణుగోపాల్, శ్రీనివాస్, మహిళలు పాల్గొన్నారు.
పెంచికల్‌పేట, (ఆంధ్రజ్యోతి) మండల కేంద్రంలోని కోదాండ రామలయంలో ఆర్యవైశ్య సంఘం అధ్వర్యంలో వాసవీ మాత జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు వాసవీమాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, మహిళ సంఘం సభ్యులు పాల్గొన్నారు.