Share News

kumaram bheem asifabad- కరుణించని వరుణుడు

ABN , Publish Date - Jul 14 , 2026 | 11:07 PM

వర్షాభావ పరిస్థితులు జిల్లాను కరువుకోరల్లోకి నెట్టేసే పరిస్థితి కనిపిస్తున్నది. రుతుపవనాలు ప్రారంభమై నెలన్నర గడిచినా సాధారణ వర్షపాతం కూడా నమోదు కాక జిల్లావ్యాప్తంగా నాట్లు వేయలేని పరిస్థితి నెలకొన్నది. మరోవైపు జిల్లాలో రైతులు పెట్టిన పత్తి విత్తనాలు సైతం పూర్తి స్థాయిలో మొలవ లేదు. మొలకెత్తిన మొలకలు సైతం వర్షం లేక పోవడంతో వాడిపోతు న్నాయి

kumaram bheem asifabad- కరుణించని వరుణుడు
వెలవెలబోతున్న నాగమ్మ చెరువు

- ఆందోళనలో అన్నదాతలు

సిర్పూరు(టి), జూలై 14 (ఆంధ్రజ్యోతి): వర్షాభావ పరిస్థితులు జిల్లాను కరువుకోరల్లోకి నెట్టేసే పరిస్థితి కనిపిస్తున్నది. రుతుపవనాలు ప్రారంభమై నెలన్నర గడిచినా సాధారణ వర్షపాతం కూడా నమోదు కాక జిల్లావ్యాప్తంగా నాట్లు వేయలేని పరిస్థితి నెలకొన్నది. మరోవైపు జిల్లాలో రైతులు పెట్టిన పత్తి విత్తనాలు సైతం పూర్తి స్థాయిలో మొలవ లేదు. మొలకెత్తిన మొలకలు సైతం వర్షం లేక పోవడంతో వాడిపోతు న్నాయి. పోసిన నారు మడులు ముదిరిపోతుండగా అడపాదడపా కురిసిన కొద్దిపాటి వర్షానికి వేసిన పత్తి విత్తనాలు మొలకెత్తక కొన్ని, మొలకెత్తినవి ఎండిపోతూ మరికొన్ని రైతులను కన్నీరు పెట్టిసు ్తన్నాయి. జిల్లా వ్యాప్తంగా 4.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పత్తి పంటపై మొగ్గు చూపుతున్నారు. అలాగే కొన్ని చోట్ల కూడా వరినారుమళ్లు సిద్ధం చేస్తున్నారు. రానున్న రోజుల్లో విస్తారంగా కురుస్తాయన్న ఆశలో పనులు మందకొడిగా చేపడుతున్నారు. ఎల్‌నినో ప్రభావం తో ఆరుతడి పంటలను సాగు చేయడం మేలని, ఒక వేళ వరి సాగు చేయాలనుకుంటే స్వల్పకాలిక రకాలను ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సిర్పూరు(టి) మండల కేంద్రంలోని నాగమ్మ చెరువు పూర్తిగా నిండలేదు. గత పది రోజుల క్రితం కురిసిన వర్షాలతో ఈ చెరువులో నీరు కూడా నిండని పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా ఈ చెరువు కింద ఆయకట్టు దారులు 1,600 ఎకరాల్లో రైతులు వరి సాగును చేస్తారు. ఈ యేడు వర్షాలు కురవక పోవడం, చెరువులో నీరు లేక పోవడంతో వరి సాగు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ చెరువుపై ఆశలు పెట్టుకున్న వరి రైతులకు పూర్తిగా నట్టేట ముంచినట్లయింది.

- ప్రతికూల పరిస్థితులతో..

ఈ వానాకాలం సీజన్‌లో నెలకొన్న ప్రతికూల పరి స్థితులతో రైతాంగం సతమతమవుతోంది. ముఖ్యం గా జిల్లాలో భారీ వర్షాలు లేకపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. వర్షాకాలం ప్రారంభమైనప్పటకి ఆశించిన మేర వర్షాలు లేక జూన్‌ తీవ్రంగా నిరాశే మిగిల్చింది. వర్షాకాలం ప్రారంభంలో అడపా దడపా వర్షాలు పడినప్పటికీ కేవలం పత్తి రైతులు మాత్రమే సాగు విత్తనాలు నాటారు. వరి పంటకు నీటి తడి ఎక్కువ కావాల్సిన దృష్ట్యా వరి సాగు చేసే రైతులు నారుమడులు సిద్ధం చేసుకోలేదు. భారీ వర్షాలు కురుస్తాయన్న ఆశతో అంతా ఎదరుచూశారు. రోజులు గడుస్తున్నా వర్షాలు లేక పోవటంతో ఈ సారి వరి పంట వేయలేక వెనుకడుగు వేస్తున్నారు. వరుణుడు కరుణిస్తేనే పంటలు వేసేందుకు అంతా ఎదురు చూస్తున్నారు. వరి సాగు చేసే రైతన్నల పరిస్థితి దయనీయంగా మారింది. కిందటేడు ఆశించిన మేర వర్షాలు కురువడంతో వరి పంట కూడా సకాలంలో వేసినట్టు, ఈ సారి మాత్రం వర్షా కాలం ఆరంభమైనప్పటికీ ఇంత వరకు వర్షాలు వేయ లేదని రైతులు వాపోతున్నారు. వరి కోసం అంతా సిద్ధం చేసుకున్నామని చెబుతున్నారు. ఇప్పు డు వర్షాలు లేక పోవడంతో రైతన్నల పరిస్థితి దయనీయంగా మారింది.

Updated Date - Jul 14 , 2026 | 11:07 PM