వరంగల్ వైద్యురాలు ప్రశాంతికి హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు
ABN , Publish Date - Mar 10 , 2026 | 03:48 AM
వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్న ప్రముఖ గైనకాలజిస్ట్, వరంగల్ వైద్యురాలు మచ్చా ప్రశాంతికి జాతీయ స్థాయి అరుదైన గౌరవం దక్కింది.
హైదరాబాద్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్న ప్రముఖ గైనకాలజిస్ట్, వరంగల్ వైద్యురాలు మచ్చా ప్రశాంతికి జాతీయ స్థాయి అరుదైన గౌరవం దక్కింది. ముంబైలో ఇటీవల నిర్వహించిన ‘ఈటీ (ఎకనామిక్ టైమ్స్) హెల్త్ వరల్డ్’ నేషనల్ ఫెర్టిలిటీ అవార్డ్స్- 2026 వేడుకల్లో ఆమెకు ప్రతిష్ఠాత్మక ‘హాల్ ఆఫ్ ఫేమ్-నేషనల్’ పురస్కారాన్ని అందజేశారు. ప్రశాంతి.. 20 ఏళ్లుగా వైద్య రంగంలో సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె రెయిన్‌బో ప్రశాంతి హాస్పిటల్ (వరంగల్)కు డైరెక్టర్‌గా, గైనకాలజీ విభాగం హెచ్‌ఓడీగా ఉన్నారు. సంతాన సాఫల్య చికి త్స, స్త్రీ జననేంద్రియ వైద్య విభాగంలో ఆమె అందిస్తున్న అత్యుత్తమ సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశా రు. హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డును ఆ సంస్థ ప్రతినిధి అమిత్‌కుమార్ గుప్తా చేతుల మీదుగా ఆమె అందుకున్నారు.