kumaram bheem asifabad- ఘనంగా వరలక్ష్మీ పూజలు
ABN , Publish Date - Aug 21 , 2026 | 11:22 PM
జిల్లాలో వైభవంగా వరలక్ష్మీ వ్రత పూజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆసిఫాబాద్ పట్టణంతో పాటు మండలంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం మహిళలు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సామూహిక వరలక్ష్మీ వ్రతం కార్యక్రమాన్ని నిర్వహించగా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వైభవంగా వరలక్ష్మీ వ్రత పూజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆసిఫాబాద్ పట్టణంతో పాటు మండలంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం మహిళలు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సామూహిక వరలక్ష్మీ వ్రతం కార్యక్రమాన్ని నిర్వహించగా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అర్చకులు తిరుపతిచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈకార్యక్రమంలో హెచ్‌ఎం కోటేశ్వర్‌రావు, ఉపాధ్యాయులు, మహిళ భక్తులు తదితరులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ శిశు మందిర్ పాఠశాలలో వరలక్ష్మీ వ్రత పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వరలక్ష్మి పూజ వ్రతం ఆవశ్యతకను వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ కొత్తపల్లి అనిత, కొడిప్యాక సత్యనారాయణ, జిల్లా సభ్యులు భారతి, మాతృ మండలి సభ్యులు, దాసరి వెంకటేష్ నాగరాణి పాల్గొన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కుంటలమానేపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి పూజలు చేశారు. భక్తులు లక్ష్మిదేవికి వివిధ రకాల నైవేద్యాలు ఫలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఇందిరానగర్‌లో శ్రీకనకదుర్గాదేవి మహంకాళి ఆలయంలో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం, నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వాయినాలను ఇచ్చుకున్నారు. భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు దేవర వినోద్ స్వామి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.