Share News

యువజన సర్వీసుల శాఖ ప్రధాన కార్యదర్శిగా వాణిప్రసాద్‌

ABN , Publish Date - Apr 03 , 2026 | 04:57 AM

యువజన సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎ.వాణిప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పనిచేస్తూ కోర్టు తీర్పు కారణంగా...

యువజన సర్వీసుల శాఖ ప్రధాన కార్యదర్శిగా వాణిప్రసాద్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): యువజన సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎ.వాణిప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పనిచేస్తూ కోర్టు తీర్పు కారణంగా ఏపీకి వెళ్లిన ఆమె న్యాయస్థానంలో విజయం సాధించి తెలంగాణకు వచ్చారు. మార్చి 25వ తేదీన ఏపీ నుంచి రిలీవ్‌ అయిన ఆమె 26న తెలంగాణలో చేరారు. దీంతో ప్రభుత్వం ఆమెకు యువజన సర్వీసుల శాఖ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటిదాకా ఆ బాధ్యతలు చూసిన జయేష్‌ రంజన్‌ను రిలీవ్‌ చేసింది. దీంతో ఆయన మెట్రోపాలిటన్‌ ఏరియా, అర్బన్‌ డెవల్‌పమెంట్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూనే క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు చూడనున్నారు.

Updated Date - Apr 03 , 2026 | 04:58 AM