Share News

‘వందేమాతరం సైక్లోథాన్‌’ భేష్‌

ABN , Publish Date - Feb 23 , 2026 | 02:16 AM

వందేమాతరం కోస్టల్‌ సైక్లోథాన్‌-2026’ పేరిట సీఐఎస్ఎఫ్‌ నిర్వహించిన జాతీయ సైకిల్‌ యాత్ర అత్యంత శ్రమతో కూడుకున్నదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు..

‘వందేమాతరం సైక్లోథాన్‌’ భేష్‌

  • తీర ప్రాంత పరిరక్షణ బాధ్యతను చాటిన

  • సీఐఎస్ఎఫ్‌ 6,553 కి.మీ. జాతీయ యాత్ర: బండి సంజయ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): ‘వందేమాతరం కోస్టల్‌ సైక్లోథాన్‌-2026’ పేరిట సీఐఎస్ఎఫ్‌ నిర్వహించిన జాతీయ సైకిల్‌ యాత్ర అత్యంత శ్రమతో కూడుకున్నదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. అనేక కష్టాలు, అవాంతరాలను ఎదుర్కొంటూ సీఐఎ్‌సఎఫ్‌ బృందాలు 6,553 కి.మీ. మేర సైక్లోథాన్‌ను దిగ్విజయంగా ముగించడం ప్రశంసనీయమని చెప్పారు. ఈ యాత్ర ముగింపు సందర్భంగా కేరళ రాష్ట్రం కొచ్చిలో నిర్వహించిన కార్యక్రమంలో సంజయ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతదేశ తీర ప్రాంతం వేల సంవత్సరాలుగా నాగరికత, వాణిజ్యానికి కేంద్రంగా నిలిచిందన్నారు. ‘గుజరాత్‌లోని ప్రాచీన నౌకాశ్రయాల నుంచి గోవా సముద్ర తీరం వరకు, కేరళ మత్స్యకార గ్రామాల నుంచి మడ అడవుల వరకు మన తీర ప్రాంతం దేశ సముద్ర వారసత్వ కథను చెబుతుంది. ఈ సైక్లోథాన్‌.. ఆ వారసత్వానికి తగిన గౌరవం ఇవ్వడమే కాకుండా దానిని పరిరక్షించాల్సిన బాధ్యతను పునరుద్ఘాటించింద’న్నారు. బలమైన సరిహద్దులు, సురక్షిత తీరాలు కేవలం భద్రతా దళాల వల్ల మాత్రమే కాదని, అవగాహన కలిగిన, శక్తివంతమైన పౌరుల వల్లే సాధ్యమని చెప్పారు. సీఐఎ్‌సఎ్‌ఫకు చెందిన 130 మంది సైకిల్‌ యాత్రికుల్లో 50 శాతం మహిళలే ఉండడం ప్రశంసనీయమన్నారు. వీరంతా మహిళలు ప్రతి రంగంలోనూ దృఢంగా నిలబడగలరని నిరూపించారని చెప్పారు.

Updated Date - Feb 23 , 2026 | 02:16 AM