చైతన్యపురిలో వైశ్యరాజు జ్యువెలర్స్ ప్రారంభం
ABN , Publish Date - Feb 23 , 2026 | 02:26 AM
హైదరాబాద్‌లోని చైతన్యపురిలో వైశ్యరాజు జ్యువెలర్స్ షోరూం ప్రారంభమైంది. ప్రముఖ సినీ నటి అనుపమ పరమేశ్వరన్ ఆదివారం జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్‌ను ప్రారంభించారు.
ప్రముఖ సినీ నటి అనుపమ పరమేశ్వరన్ సందడి
చాదర్‌ఘాట్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని చైతన్యపురిలో వైశ్యరాజు జ్యువెలర్స్ షోరూం ప్రారంభమైంది. ప్రముఖ సినీ నటి అనుపమ పరమేశ్వరన్ ఆదివారం జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ అంతటా కలియ తిరుగుతూ అభిమానులకు సందడి చేశారు. కాగా, విభిన్న ఆభరణాల కలెక్షన్‌ను పరిశీలించిన అనుపమ మాట్లాడుతూ.. వైశ్య రాజు జ్యువెలర్స్ 17వ బ్రాంచిని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సంస్థ చైర్మన్ వైశ్యరాజు పల్గుణ రాజు మాట్లాడుతూ షోరూంలో ప్రత్యేక పెళ్లి కలెక్షన్ అందుబాటులో ఉందన్నారు. కొత్తషోరూం ప్రారం భం సందర్భంగా 22క్యారెట్ల బంగారుఆభరణాలపై 6ుతరుగు మాత్రమే వసూలు చేస్తున్నామన్నారు. ఎండీ వైశ్యరాజు భద్రగిరిరాజు మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఇది తమ రెండో బ్రాంచ్ అని చెప్పారు. జామి భోజరాజు చేసి ఆభరణాల కొనుగోలుతో శుభారాంభం చేశారు. షోరూమ్ ప్రారంభం నేపథ్యంలో వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదని యాజమాన్యం ప్రకటించింది.