Share News

వ్యాక్సినేషన్‌ను సక్రమంగా చేపట్టాలి

ABN , Publish Date - Jan 03 , 2026 | 11:13 PM

వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్‌ కార్య క్రమాన్ని సక్రమంగా చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మాస్‌ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్‌ పేర్కొన్నారు.

వ్యాక్సినేషన్‌ను సక్రమంగా చేపట్టాలి

జైపూర్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్‌ కార్య క్రమాన్ని సక్రమంగా చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మాస్‌ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్‌ పేర్కొన్నారు. శనివారం మండలంలోని ఇందా రం గ్రామపంచాయతీలో సర్పంచు ఫయాజ్‌తో కలిసి వ్యాక్సినేషన్‌ కార్యక్ర మంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పిల్లలకు క్రమం తప్పకుండా వ్యాక్సిన్‌లు వేయాలన్నారు. వ్యాక్సినేషన్‌ ద్వా రా వ్యాధుల నివారణ, అసంక్రమణ వ్యాధులు , 30 ఏళ్ల పై బడిన వారిని గుర్తించడం, బీపీ, డయాబెటిస్‌, క్యాన్సర్‌ వ్యాధులను గుర్తించి తగు జాగ్రత్త లు తీసుకోవాలని సూచించారు. అనంతరం టేకుమట్ల గ్రామంలో ఆరోగ్య కార్యకర్త చేపడుతున్న వ్యాక్సినేషన్‌ను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్‌ వైజర్‌ జ్యోతి, కృష్ణవేణి, ఆరోగ్య కార్యకర్తలు లక్ష్మీ, పద్మ, బాగ్యలక్ష్మీ , ఆశా కార్యకర్తలు ఉమాశ్రీ, తిరుమల పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2026 | 11:13 PM