kumaram bheem asifabad- బాలికలకు టీకా... భవిష్యత్తుకు భరోసా
ABN , Publish Date - Jan 01 , 2026 | 10:22 PM
మహిళల్లో ఎక్కువగా వచ్చే గర్బాశయ ముఖద్వారా(సర్వైకల్) క్యాన్సర్ నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ సిద్దం చేసింది. 14 ఏళ్లు నిండిన బాలికలకు హ్యుమన్ పాపిలోమా వైరస్(హెచ్‌పీవీ) టీకా ఉచితంగా ఇచ్చేందుకు సన్నాహలు చేస్తొంది.
ఆసిఫాబాద్‌రూరల్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): మహిళల్లో ఎక్కువగా వచ్చే గర్బాశయ ముఖద్వారా(సర్వైకల్) క్యాన్సర్ నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ సిద్దం చేసింది. 14 ఏళ్లు నిండిన బాలికలకు హ్యుమన్ పాపిలోమా వైరస్(హెచ్‌పీవీ) టీకా ఉచితంగా ఇచ్చేందుకు సన్నాహలు చేస్తొంది. ఇందులో బాగంగా ఇప్పటికే వైద్యాదికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం పూర్తయింది. త్వరలోనే క్షేత్రస్థాయిలో బాలికలకు టీకా ఇచ్చేలా ప్రణాళిక రుపొందిస్తున్నారు.
- 100కు పైగా నమోదు..
మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌తో పాటు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో 118 కేసులు నమోదు అయ్యాయి. హ్యుమన్ పాపిలోమా వైరస్ కారణంగా ఇది సోకుతోందని చెబుతున్నారు. శరీరంలోనూ వైరస్ కారణంగా ఇది సోకుతుంది. శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొన్నేళ్ల తరబడి వృద్ది చెంది క్యాన్సర్‌కు కారణమవుతుంది. ప్రాథమిక దశలో గుర్తిస్తే నయం కావడానికి అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. కానీ అవగాహన లేమితో చాలా మంది పరీక్షలు చేయించుకోక దీని బారిన పడుతున్నారు. మొదటి దశలో గుర్తించలేక వ్యాధి ముదిరిపోయే దశలో బయటపడి మరణానికి దారితీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో సర్వైకల్ క్యాన్సర్ నుంచి పూర్తి రక్షణ కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేసేందుకు నిర్ణయించింది.
సుమారు ఐదువేల మంది....
ఇప్పటికే టీకా వేయడంపై ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైద్యులకు, ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇచ్చారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో, పట్టణాల్లో ఇంటింటి సర్వే జరిపి 14 ఏళ్లు నిండి 15 ఏళ్లలోపు ఉన్న బాలికలను గుర్తించనున్నారు. జిల్లాలో సుమారు 5వేల మంది బాలికలు ఉంటారని అంచనా. ఒక్కొక్కరికి ఒక డోసు హెచ్‌పీవీ టీకా వేయనుండగా భవిష్యత్తులో వారికి గర్బాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పు తలెత్తకుండా నియంత్రించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
త్వరలోనే టీకా:
- సీతారాం, జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారి
పదిహేనేళ్లలోపు బాలికలకు త్వరలోనే హెచ్‌పీవీ టీకా ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలకు శిక్షన పూర్తయింది. ప్రభుత్వం ప్రకటించగానే టీకా వేయనున్నారు. గర్బాశయ ముఖద్వార క్యాన్సర్ నియంత్రణకు టీకా రక్షణ కల్పిస్తుంది.