kumaram bheem asifabad- పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా
ABN , Publish Date - Mar 10 , 2026 | 11:05 PM
జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేశారు. ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్ గ్రామంలో మంగళవారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ సురేష్‌కుమార్, సర్పంచ్ గంగారాంలు వేశారు.
ఆసిఫాబాద్‌రూరల్/సిర్పూర్(టి)/దహెగాం/పెంచికలపేట/చింతలమానేపల్లి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేశారు. ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్ గ్రామంలో మంగళవారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ సురేష్‌కుమార్, సర్పంచ్ గంగారాంలు వేశారు. ఈ సందర్భంగా 400 పశువులకు టీకాలు వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారులు మురళీకృష్ణ, సిబ్బంది మోతిరాం, వినోద్, రాజు, తదితరులు పాల్గొన్నారు. సిర్పూర్(టి) మండలం వెంపల్లి గ్రామంలో మంగళవారం పశువైద్యాధికారి విజయ్ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేశారు. ఈ సందర్భంగా గ్రామంలో 255 పశువులకు టీకాలు వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేవీఓ రాజ్‌కుమార్, గోపాలమిత్రలు భాస్కర్, నాందేవ్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. దహెగాం మండలంలోని పలు గ్రామాల్లో పశువులకు, గేదెలకు మంగళవారం గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సురేష్, డాక్టర్ శ్రావణ్, డాక్టర్ రమేశ్ సిబ్బంది పాల్గొన్నారు. పెంచికలపేట మండల కేంద్రంలో పశువైద్యాధికారి రాకేష్ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం నెల రోజుల పాటు కొనసాగుతుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచిచారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉస్మాన్, రైతులు, పశువైద్య సిబ్బంది శివకుమార్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో పశువైద్యాధికారి శ్రీకాంత్ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్, సిబ్బంది రాజన్న, స్రవంతి, దక్షణమూర్తి, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.