వైద్య ఆరోగ్యశాఖలో వెక్కిరిస్తున్న ఖాళీలు
ABN , Publish Date - Nov 09 , 2026 | 11:28 PM
రాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం పదే పదే చెబుతున్నప్పటికీ అది క్షేత్రస్థాయిలో అమలు కావ డం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కీలక పోస్టుల్లో ఖాళీల కారణంగా ఇన్‌చార్జిలతో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితు లు నెలకొన్నాయి.
-డీఎంహెచ్‌వో సహా పలు పోస్టులు ఖాళీ
-పీహెచ్‌సీలలోనూ వేధిస్తున్న సిబ్బంది కొరత
-క్లస్టర్ హెల్త్ సెంటర్లదీ అదే పరిస్థితి
-ఇన్‌చార్జిలతో కాలం వెళ్లదీస్తున్న వైనం
మంచిర్యాల, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం పదే పదే చెబుతున్నప్పటికీ అది క్షేత్రస్థాయిలో అమలు కావ డం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కీలక పోస్టుల్లో ఖాళీల కారణంగా ఇన్‌చార్జిలతో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితు లు నెలకొన్నాయి. కొన్ని ముఖ్య విభాగాల్లోనూ డిపార్ట్ మెంటల్ అధిపతులు లేకపోవడం పరిస్థితికి అద్దం ప డుతోంది. జిల్లాలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌తో పాటు 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 03 కమ్యూనిటీ హెల్ట్ సెంటర్లు, 01 పీపీ యూనిట్ (ఇమ్యూనైజేషన్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్), 04 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 04 బస్తీ దవాఖానాలు, 01 ఆప్తాల్మిక్ యూనిట్ ఉన్నాయి. ప్రతీ పీహెచ్‌సీలో సివిల్ అసిస్టెం ట్ సర్జన్‌తోపాటు సీహెచ్‌వో, పీహెచ్‌ఎన్, సీనియర్ అ సిస్టెంట్లు, స్టాఫ్ నర్సులు, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెం ట్లు, ఏపీఎంవో, ఎంపీహెచ్‌ఎస్, గ్రేడ్-2 ఫార్మాసిస్ట్, గ్రే డ్-2 ల్యాబ్ టెక్నీషియన్, ఆఫీస్ సబార్డినేట్స్ విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
పీహెచ్‌సీల్లో 260 ఖాళీలు...
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పెద్ద మొత్తంలో ఖాళీలు ఉన్నాయి. వాటిలో ఆయా ఆ సుపత్రుల్లో మెడికల్ ఆఫీసర్లు మినహా ఇతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితో పా టు ఇతర అన్ని వైద్యశాలలకు గాను మొత్తం 568 పో స్టులు మంజూరుకాగా, 308 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. మరో 260 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీ లు ఉన్న వాటిలో డిప్యూటీ సివిల్ సర్జన్లు 2 పోస్టులకు గాను ఒకరే విధులు నిర్వహిస్తుండగా, మరో పోస్టు ఖా ళీగా ఉంది. అలాగే సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 44 పోస్టు లకు 32 మంది విధుల్లో ఉండగా, మరో 12 ఖాళీలు ఉ న్నాయి. డిస్ట్రిక్ట్ న్యూక్లస్ మెడికల్ ఆఫీసర్ ఒకరు ఉం డాల్సి ఉండగా, ఆ పోస్టు ఖాళీగా ఉంది. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు 13 పోస్టులకుగాను 9 మంది పొజిషన్ లో ఉండగా, 4 ఖాళీలు ఉన్నాయి. స్టాటిస్టికల్ ఆఫీసర్ ఒక పోస్టు ఉండగా, ప్రస్తుతం ఖాళీగా ఉంది. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఒక పోస్టు ఉండగా, అది కూడా ఖాళీగానే ఉంది. డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ ఒక పోస్టు ఉండగా, ప్రస్తుతం ఖాళీగా ఉంది. డిస్ట్రిక్ట్ ప్యారమెడికల్ ఆఫీసర్ 6 పోస్టులకుగాను మొ త్తం ఖాళీగానే ఉన్నాయి. ప్యారమెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీ సర్ 5 పోస్టులకుగాను ఇద్దరు పొజిషన్‌లో ఉండగా, మ రో 3 ఖాళీలు ఉన్నాయి. మల్టీ పర్పస్ హెల్త్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ 10 పోస్టులకుగాను 8 మంది పొజిషన్‌లో ఉం డగా, మరో 2 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ ప్యారమె డికల్ ఆఫీసర్ 9 పోస్టులకు గాను మొత్తం ఖాళీగానే ఉన్నాయి. రేడియో గ్రాఫర్ 3 పోస్టులకుగాను ఒక్కరు కూడా పొజిషన్‌లో లేరు. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (పురుషులు) 74 పోస్టులు ఉండగా, 24 మంది పొజి షన్‌లో ఉన్నారు. మరో 50 ఖాళీలు ఉండగా, 9 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళలు) 125 పోస్టులకు గాను 80 మంది పొజిషన్‌లో ఉండగా, 45 ఖాళీలు ఉ న్నాయి. ఈ విభాగంలో 114 మంది కాంట్రాక్ట్ ఉద్యోగు లతో విధులు నిర్వహింపజేస్తున్నారు. మల్టీ పర్పస్ హె ల్త్ సూపర్ వైజర్ (పురుషులు) 25 పోస్టులు ఉండగా, అన్నీ ఖాళీగానే ఉన్నాయి. మల్టీ పర్పస్ హెల్త్ సూపర్ వైజర్ (మహిళలు) 25 పోస్టులు ఉండగా 24 మంది పొజిషన్‌లో ఉన్నారు. లోయర్ డివిజన్ స్టెనోగ్రాఫర్ ఒక పోస్టు ఉండగా, అది కూడా ఖాళీగానే ఉంది. మేల్ నర్సింగ్ ఆర్డర్లీ 13 పోస్టులు ఉండగా, 4గురు పొజిషన్ లో ఉన్నారు. మరో 9 ఖాళీలు ఉన్నాయి. డార్క్ రూం అసిస్టెంట్ 3 పోస్టులకుగాను ఒక్కరే పొజిషన్‌లో ఉన్నా రు. మరో రెండు ఖాళీగా ఉన్నాయి. స్టాఫ్ నర్స్ 39 పో స్టులకుగాను 25 మంది పొజిషన్‌లో ఉండగా, 14 ఖాళీ లు ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులు 27 కుగాను, 25 మంది పొజిషన్‌లో ఉండగా, 2 ఖాళీలు ఉన్నాయి. ఫార్యాసిస్ట్ గ్రేడ్-2 పోస్టులు 21కి గాను 8 మంది పొజిషన్‌లో ఉండగా, 13 ఖాళీలు ఉన్నాయి. ఈ విభాగంలో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి విధులు నిర్వహిస్తు న్నారు. హెల్త్ ఎడ్యుకేటర్ 3 పోస్టులకుగాను ఒకరు పొజిషన్‌లో ఉండగా 2 ఖాళీలు ఉన్నాయి. ల్యాబ్ అటెం డెంట్ 2 పోస్టులకుగాను ఒకరు పొజిషన్‌లో ఉండగా, మరో పోస్టు ఖాళీగా ఉంది. ఆఫీస్ సబార్డినేట్ 22 పో స్టులకుగాను 17 మంది పొజిషన్‌లో ఉండగా, 5 ఖళీలు ఉన్నాయి. అలాగే వార్డ్ బాయ్ ఒక పోస్టుకుగాను అది ఖాళీగా ఉంది. ఫీల్డ్ వర్కర్ ఒక పోస్టుకుగాను అది కూ డా ఖాళీగానే ఉంది. ఫ్యామిలీ వెల్ఫేర్ వర్కర్ 2 పోస్టులకుగాను ఒకరు పొజిషన్‌లో ఉండగా, మరో పో స్టు ఖాళీగా ఉంది. నైట్ వాచ్‌మన్ 4 పోస్టులకుగాను ఒకరు పొజిషన్‌లో ఉండగా, మరో మూడు ఖాళీగా ఉన్నాయి. డ్రైవర్ 15 పోస్టులకుగాను 5గురు పొజిషన్ లో ఉండగా, మరో 10 ఖాళీలు ఉన్నాయి. కుక్ 3 పో స్టులకుగాను ఒకరు పొజిషన్‌లో ఉండగా, మరో 2 ఖాళీ లు ఉన్నాయి. ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య అధికారులు అవసరమైన నివేదికలు అందజేసినట్లు తెలుస్తోంది.
వైద్య కళాశాలలోనూ అరకొర సిబ్బందే...
జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితోపాటు మాతా శిశు ఆరోగ్య కేంధ్రంలోనూ మంజూరైన పోస్టులకు సరి పడా నియామకాలు లేకపోవడంతో వాటికి అనుంబం ధంగా పని చేస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి అ వసరమైన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బందిని పిలి పించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా మెడికల్ కాలేజీలోనూ సరిపడా సంఖ్య లేకపోవడంతో ప్రజలకు కొంతమేర ఇబ్బందులు తప్పడం లేదు. వైద్య కళాశాలకు 139 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మం జూరు కాగా, ప్రస్తుతం విధుల్లో కేవలం 49 మంది మా త్రమే ఉన్నారు. మరో 90 ఖాళీలు ఉన్నాయి. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ విభాగంలో 51 పోస్టులు మం జూరు కాగా ప్రస్తుతం ఎనిమిది పొజిషన్‌లో ఉన్నారు. ఈ విభాగంలో మరో 43 ఖాళీగా ఉన్నాయి. ఇక ప్రొ ఫెసర్ విభాగంలో 41 పోస్టులు మంజూరు కాగా, విధు ల్లో 14 మంది ఉన్నారు. ఈ విభాగంలో మరో 27 పో స్టులు ఖాళీగా ఉన్నాయి.
డీఎంహెచ్‌వో పోస్టు ఖాళీ....
జిల్లా వైద్య ఆరోగ్యశాఖను ఎప్పటికప్పుడు పర్యవేక్షి స్తూ వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉండేలా చ ర్యలు తీసుకోవలసిన డీఎంఅండ్‌హెచ్‌వో (డిస్ట్రిక్ట్ మె డికల్ అండ్ హెల్త్ ఆఫీసర్) పోస్టే ఖాళీగా ఉండటం గ మనార్హం. గతంలో ఇక్కడ డీఎంఅండ్‌హెచ్‌వోగా పని చేసిన డా.హరీష్‌రాజ్ గతేడాది నవంబర్ ఒకటవ తే దీన బదిలీకాగా సంవత్సర కాలంగా ఆ పోస్టులో ఇన్ చార్జి డీఎంహెచ్‌ఓలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. డీఎం హెచ్‌వో పోస్టులో సివిల్ సర్జన్ ఉండాల్సి ఉండగా, డి ప్యూటీ సివిల్ సర్జన్ క్యాడర్‌గల అధికారులకు జిల్లా బాధ్యతలు అప్పగిస్తూ వస్తున్నారు. దీంతో ఆసుపత్రుల పర్యవేక్షణ పూర్తిస్థాయిలో జరగడంలేదన్న అభిప్రాయా లు ఉన్నాయి. ఇన్‌చార్జి అధికారి కావడంతో వైద్యులు, సిబ్బందిపై అజమాయిషీ పూర్తిస్థాయిలో ఉండటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా రెగ్యులర్ డీఎంఅండ్‌హెచ్‌ను త్వరితగతిన నియమించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.