Share News

నేటి నుంచి వి.హన్మంతరావు నిరాహార దీక్ష

ABN , Publish Date - May 09 , 2026 | 06:21 AM

జనగణనలో భాగంగా బీసీ కులగణననూ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి. హన్మంతరావు శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నారు.

నేటి నుంచి వి.హన్మంతరావు నిరాహార దీక్ష

ఇంటర్నెట్ డెస్క్: జనగణనలో భాగంగా బీసీ కులగణననూ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి. హన్మంతరావు శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నారు. హైదరాబాద్‌ అంబర్‌పేటలోని తన నివాసంలో ఉదయం పదిన్నర గంటలకు ఆయన దీక్ష చేపడతారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన న్యాయం జరగాలంటే బీసీ జనాభానూ లెక్కించాలంటూ తాను పలు మార్లు ప్రధాని మోదీకి లేఖలు రాశానని, ఆయన నుంచి స్పందన లేకపోవడంతో దీక్ష చేపట్టాల్సి వస్తోందని శుక్రవారం ఓ ప్రకటనలో ఆయన వెల్లడించారు.

Updated Date - May 09 , 2026 | 06:21 AM