Share News

నాడు భూసేకరణ చేయకుండానే టెండర్లు

ABN , Publish Date - May 20 , 2026 | 03:30 AM

భూసేకరణ చేయకుండానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో డిస్ట్రిబ్యూటరీలకు బీఆర్‌ఎస్‌ టెండర్లు పిలిచిందని మంత్రి ఉత్తమ్‌ ఆరోపించారు.

నాడు భూసేకరణ చేయకుండానే టెండర్లు

  • బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన నష్టాన్ని సరిదిద్దుతాం: ఉత్తమ్‌

హైదరాబాద్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): భూసేకరణ చేయకుండానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో డిస్ట్రిబ్యూటరీలకు బీఆర్‌ఎస్‌ టెండర్లు పిలిచిందని మంత్రి ఉత్తమ్‌ ఆరోపించారు. సచివాలయంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రాజెక్టులపై మంగళవారం మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలతో కలిసి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. దేవాదుల, ఎస్‌ఎల్‌బీసీ, సీతారామ ఎత్తిపోతలతో సమానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్య జాబితాలో ఉంచినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక దాన్ని సరిదిద్దుతున్నామన్నారు. బీఆర్‌ఎస్‌ తీసుకున్న నిర్ణయంతో పాలమూరు-రంగారెడ్డి కొత్త ప్రాజెక్టుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. .

Updated Date - May 20 , 2026 | 03:30 AM