Share News

మోయలేని భారంగా అప్పులు

ABN , Publish Date - Mar 30 , 2026 | 05:18 AM

నీటి పారుదల శాఖ కోసం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పులు మోయలేని భారంగా మారాయని, అసలు, వడ్డీ చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెఛీప్పారు.

మోయలేని భారంగా అప్పులు

  • గత ప్రభుత్వ అప్పులకు అసలు, వడ్డీ చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్నాం: ఉత్తమ్‌

హైదరాబాద్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): నీటి పారుదల శాఖ కోసం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పులు మోయలేని భారంగా మారాయని, అసలు, వడ్డీ చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెఛీప్పారు. వేసవిలో నదుల్లో నీటి మట్టాలు తగ్గి రాష్ట్ర ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చూసేందుకు ఇప్పటికే కృష్ణా నదిపై ఉన్న విద్యుత్‌ ప్రాజెక్టులను ఆపివేశామని, అలాగే ఏపీ ప్రభుత్వాన్ని శ్రీశైలం వద్ద విద్యుత్‌ ప్రాజెక్టును నిలిపివే యాలని కోరామని తెలిపారు. పెండింగ్‌ బిల్లులను ప్రాధాన్యం ప్రాతిపదికన విడుదల చేస్తున్నామని చెప్పారు. గత రెండున్నరేళ్లలో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియగా జరుగుతోందని, గత ప్రభుత్వ హయాంలో 89 లక్షల రేషన్‌కార్డులు ఉంటే వాటి ని కోటి ఐదు లక్షలకు పెంచామన్నారు. గృహావసరాలకు ప్రస్తుతం గ్యాస్‌ కొరత లేదని, వాణిజ్య సిలిండర్లు, సీఎన్‌జీ గ్యాస్‌ సరఫరా తక్కువగా ఉండటంతో క్రమంగా సరఫరా పెంచుతామని ఆయన తెలిపారు. వాణిజ్య సిలిండర్ల సరఫరాను 20శాతం నుంచి 40శాతానికి పెంచామన్నారు.

Updated Date - Mar 30 , 2026 | 05:18 AM