100 శాతం విజయం మాదే: ఉత్తమ్
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:33 AM
మునిసిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంద శాతం విజయం సాధిస్తుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
హుజూర్‌నగర్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంద శాతం విజయం సాధిస్తుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్, నేరేడుచర్ల, కోదాడ పట్టణాల్లో మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా చేపట్టిన ప్రచారాల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన సన్న బియ్యం పథకంతెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గేమ్ చేంజర్‌గా మారిందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. చరిత్రలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలుచేస్తోందన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా వంద శాతం ఫలితాలు సాధిస్తామన్నారు. పదేళ్లు అధికారంలో ఉండేది కాంగ్రేస్ పార్టీనే అన్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశామని, రాబోయే ఎనిమిదేళ్ల కాలంలో తెలంగాణలో ఇంకా అనేక అభివృద్ది పనులు చేసి తెలంగాణను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా చేయబోతున్నామన్నారు.