Share News

తెలంగాణ రైతులపై కేంద్రానికి చిత్తశుద్ధిలేదు

ABN , Publish Date - May 27 , 2026 | 04:19 AM

తెలంగాణ రైతాంగంపై కేంద్రానికి చిత్తశుద్ధిలేదని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. పంట ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించి...

తెలంగాణ రైతులపై కేంద్రానికి చిత్తశుద్ధిలేదు

  • చివరి ధాన్యం గింజవరకు కొనుగోలుచేస్తాం: ఉత్తమ్‌

తెలంగాణ రైతాంగంపై కేంద్రానికి చిత్తశుద్ధిలేదని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. పంట ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించి చేతులు దులిపేసుకుంటున్నదని, కొనుగోళ్లు ఏమాత్రం చేయటంలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల చివరిధాన్యం గింజవరకు కొనుగోలు చేస్తుందని, ఇప్పటిరకు కొనుగోలు కేంద్రాల ద్వారా 54 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించినట్లు తెలిపారు. 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం 52 లక్షల టన్నులకే అనుమతి ఇచ్చిందని, దాంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షల టన్నుల వరకు ధాన్యం కొను గోలుచేస్తుందని చెప్పారు. వాస్తవ పరిస్థితులను అర్ధం చేసుకోకుండా బీజేపీ నేతలు విమర్శలు చేయటం సరికాదన్నారు.

Updated Date - May 27 , 2026 | 04:19 AM