Share News

మార్గదర్శకాల ప్రకారమే టీచర్ల బదిలీలు చేయాలి: యూటీఎఫ్‌

ABN , Publish Date - May 17 , 2026 | 05:17 AM

రాష్ట్రంలోని అన్ని సొసైటీల గురుకుల పాఠశాల టీచర్ల బదిలీలు విద్యాశాఖ జారీచేయబోయే మార్గదర్శకాల ప్రకారమే నిర్వహించాలని టీయ్‌సయుటిఎఫ్‌...

మార్గదర్శకాల ప్రకారమే టీచర్ల బదిలీలు చేయాలి: యూటీఎఫ్‌

హైదరాబాద్‌, మే 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని సొసైటీల గురుకుల పాఠశాల టీచర్ల బదిలీలు విద్యాశాఖ జారీచేయబోయే మార్గదర్శకాల ప్రకారమే నిర్వహించాలని టీయ్‌సయుటిఎఫ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ప్రకారం మినిస్టీరియల్‌ సిబ్బందికి మాత్రమే బదిలీలు చేయాలని, ఈ మార్గదర్శకాలు ఉపాధ్యాయులకు వర్తించవని అభిప్రాయపడింది. జీవో 38లోని నిబంధన 8(ఎ) ప్రకారం ఉపాధ్యాయులకు సంబంధించి విద్యాశాఖ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయడానికి అవకాశం ఉందని, ఉపాధ్యాయులంతా ప్రస్తుతం జనగణన విధుల్లో ఉన్నందున జూలై, ఆగస్టులో ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టడానికి మార్గదర్శకాలు జారీ చేయాలని కోరింది. కొన్ని గురుకులాల యాజమాన్యాలు ఉపాధ్యాయ బదిలీలను జీవో 38 ప్రకారమే చేసేందుకు యత్నిస్తున్నాయని, ఇది నిబంధనలకు విరుద్థమని టీఎ్‌సయూటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు చావ రవి, ఎం.వెంకట్‌ తెలిపారు

Updated Date - May 17 , 2026 | 05:17 AM