Share News

kumaram bheem asifabad- విద్యుత్‌ ఫెన్సింగ్‌ వాడకం ప్రమాదకరం

ABN , Publish Date - Feb 05 , 2026 | 10:24 PM

అడవి జంతువుల నుంచి పంటల రక్షణ పేరుతో విద్యుత్‌ పెన్షింగ్‌ ఏర్పాటు ప్రమాదకరమని, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఉత్తమ్‌ జాడె అన్నారు. స్థానికంగా గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అడవి జంతువుల నుంచి పంటలను కాపాడుకునేందుకు వరి పొలాలు, వ్యవసాయ భూముల చుట్టు అక్రమంగా విద్యుత్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయడం వల్ల తీవ్రమైన విద్యుత్‌ ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు.

kumaram bheem asifabad-  విద్యుత్‌ ఫెన్సింగ్‌ వాడకం ప్రమాదకరం
లింగాపూర్‌లో సబ్‌స్టేషన్‌ ఏర్పాటు స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఈ ఉత్తం జాడే

ఆసిఫాబాద్‌రూరల్‌, పిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): అడవి జంతువుల నుంచి పంటల రక్షణ పేరుతో విద్యుత్‌ పెన్షింగ్‌ ఏర్పాటు ప్రమాదకరమని, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఉత్తమ్‌ జాడె అన్నారు. స్థానికంగా గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అడవి జంతువుల నుంచి పంటలను కాపాడుకునేందుకు వరి పొలాలు, వ్యవసాయ భూముల చుట్టు అక్రమంగా విద్యుత్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయడం వల్ల తీవ్రమైన విద్యుత్‌ ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. ఈ ప్రమాదాల కారణంగా గతంలో పలు చోట్ల రైతులు, వ్యవసాయ కూలీలు, అలాగే పశువుల ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయని ఆవేధన వ్యక్తం చేశారు. ప్రజలు తమ పరిసరాల్లో ఎక్కడైనా అక్రమ విద్యుత్‌ పెన్షింగ్‌ ఉన్నట్లు గమనిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు.

జైనూర్‌, (ఆంధ్రజ్యోతి): పంటల రక్షణ కోసం నేరుగా విద్యుత్‌ తీగలను ఫెన్సింగ్‌గా వాడడం అత్యంత ప్రమాదకరమని, ఇది చట్టరీత్యా నేరమని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఉత్తమ్‌ జాడె అన్నారు. మండల కేంద్రలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులు, ప్రజలు తమ పరిసర పొలాల్లో ఎట్టి పరిస్థితిల్లోనూ విద్యుత్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయకూడదని చెప్పారు. పంటల రక్షణ కోసం సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని ఎస్‌ఈ కోరారు. ముఖ్యంగా సోలార్‌ ఆధారిత ఫెన్సింగ్‌ ఇతర సురక్షిత వ్యవసాయ పద్ధతులను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు తమ పరిసరాల్లో ఎక్కడైనా అక్రమ విద్యుత్‌ ఫెన్సింగ్‌ ఉన్నట్లు గమనిస్తే వెంటనే విద్యుత్‌ అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. విద్యుత్‌ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో డీఈఈ అడె

లింగాపూర్‌ , (ఆంధ్రజ్యోతి): పంటల రక్షణ కోసం నేరుగా విద్యుత్‌ తీగలను ఫెన్సింగ్‌గా వాడడం చట్టరీత్యా నేరమని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఉత్తమ్‌ జాడె అన్నారు. లింగాపూర్‌, సిర్పూర్‌(యు), జైనూర్‌ మండలాల్లో గురువారం ఆయన పర్యటించి విద్యుత్‌ సమస్యలపై ప్రజలతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడారు. రైతులు అడవి జంతువుల బారి నుంచి తమ పంటల రక్షణ కోసం విద్యుత్‌ తీగలను ఫెన్సింగ్‌గా వాడడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉంటా యని అన్నారు. ఇళ్లకు విద్యుత్‌ మీటర్లను విద్యుత్‌శాఖ అనుమతితో తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న 200 యునిట్‌ ఉచిత విద్యుత్‌ సదుపాయానిన ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలు ఉంటే నేరుగా అధికారులు సమచారం ఇస్తే పరిష్కరిస్తారని చెప్పారు. అనంతరం మండల కేంద్రంలో రూ. 4 కోట్లతో ఏర్పాటు చేయనున్న 33కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పా టుకు గ్రామస్థులు కేటాయించిన స్థలాని పరిశీలించారు. త్వరలోనే టెండరు ఖరారు చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏడీ శ్రీనివాస్‌, ఏఈ అఖిల్‌ హైమద్‌, శ్రీకాంత్‌, విక్రమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 10:37 PM