పొదుపుగా వాడుకోవాలి
ABN , Publish Date - Nov 11 , 2026 | 11:39 PM
ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీరు విద్యుత్‌పై ప్రత్యే కంగా ఆయా గ్రామాల సర్పంచ్‌లు శ్రద్ధ తీసు కుని ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మె ల్యే వంశీకృష్ణ అన్నారు.
- బల్మూరు మండల సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ
బల్మూరు, నవంబరు 11 (ఆంరఽధజ్యోతి) : ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీరు విద్యుత్‌పై ప్రత్యే కంగా ఆయా గ్రామాల సర్పంచ్‌లు శ్రద్ధ తీసు కుని ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మె ల్యే వంశీకృష్ణ అన్నారు. మండల సమావేశంలో ఆయన పాల్గొని ఆయా శాఖల నుంచి ఏ గ్రామ పంచాయతీలలో సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రస్తుత సీజన్‌లో వరి సాగును పూర్తిగా వేయకుండా చూసుకోవాలని, నీటి లభ్యత ఉన్న చోట ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులను కోరారు. సమస్యలపైన ఎప్పుడు పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు గ్రామంలో పర్యటిస్తూ పరిశీలించి, పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో రేవతిరెడ్డి, తహసీల్దార్ శ్రీకాంత్, మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ శివగౌడ్, అదనపు వైద్యాధికారి తారాసింగ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫ లింగాల, (ఆంధ్రజ్యోతి) : ఎల్‌నివో ప్రభావంతో నీటిని వృధా కాకుండా పొదుపుగా వాడుకొ నేందుకు తగు చర్యలు తీసుకో వాలని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీ వో విజయలక్ష్మి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సర్వసభ్య సమావేశంలో అధికా రులు తమ నివేదిక చదివి వినిపించారు. ప్రతీ గ్రామంలో నీటి తొట్టిల కోసం దరఖాస్తు చేసుకో వాలని, పశుగ్రాసం కోసం గడ్డి విత్తనాలు 100 శాతం సబ్సిడీతో ఇస్తున్నారని తెలిపారు. ఈ కా ర్యక్రమంలో సూపర్‌రిండెంట్ కృష్ణ, తహసీల్దార్ వెంకటేష్, ఇరిగేషన్ డీఈ హేమలత, అచ్చం పేట మార్కెట్ చైర్మన్ గోపాల్‌రెడ్డి, ఆయా గ్రా మాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఎల్మపల్లిలో పరామర్శ
అమ్రాబాద్, (ఆంధ్రజ్యోతి) : మండలంలోని ఎల్మపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు ఏను పోతుల నిరంజన్ తండ్రి ఏనుపోతుల బాలయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసు కుని బుధవారం ఎమ్మెల్యే వంశీకృష్ణ పరామ ర్శించి సంతాపం ప్రకటించారు. ఆయన వెంట నాయకులు పాల్గొన్నారు.
ఎల్‌వోసీ అందజేత
పదర, (ఆంధ్రజ్యోతి) : పదర గ్రామానికి చెందిన మద్దెల విష్ణు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 5 లక్షల విలువైన ఎల్‌సీవోసీని బుధవారం ఎమ్మెల్యే వంశీకృష్ణ అందజేశారు. ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అచ్చం పేట మాజీ ఎంపీపీ రామనాథం, జడ్పీ టీసీ రాంబాబునాయక్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్య దర్శి రామలింగయ్య యాదవ్, సర్పంచ్ మనీ లాల్, నాయకులు షరీఫ్, సైదాజీ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.