Share News

పొదుపుగా వినియోగించాలి

ABN , Publish Date - Oct 28 , 2026 | 11:32 PM

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తాగునీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు.

పొదుపుగా వినియోగించాలి
ఉప్పునుంతల మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

- ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

అచ్చంపేట టౌన్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యో తి) : ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తాగునీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. బుధవారం పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో అరుందర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. నీరు, విద్యుత్‌వృథా కాకుండా ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని సూచిం చారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్త కుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టా లన్నారు. విద్యుత్‌ను కూడా అవసరమైన మేరకే వినియోగిస్తూ పొదుపు పాటించాలన్నారు. గ్రా మాలలో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధి కారులు, పంచాయతి కార్యదర్శులు, ఆయా గ్రా మాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.

పొదుపు పాటించాలి : ఎమ్మెల్యే

ఉప్పునుంతల, (ఆంధ్రజ్యోతి) : సూపర్‌ ఎల్‌ నినో ప్రభావంతో భూగర్భ జలా లు అడుగంటుతున్న నేపథ్యంలో గ్రామంలో ఉన్న తాగునీటిని గ్రా మస్థులు పొదుపుగా వాడుకునే విధంగా సర్పంచులు, కార్యదర్శు లు బాధ్యత తీసుకోవాలని ఎమ్మె ల్యే వంశీకృష్ణ అన్నారు. బుధవా రం మండల కేంద్రంలోని రైతువే దికలో ఎంపీవో చంద్రశేఖర్‌ అధ్యక్ష తన మండల సర్వసభ్య సమావేశం నిర్వహిం చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మిషన్‌ భగీరథ పఽథకం వచ్చిన తరువాత కొత్తబోర్లు వేసేందుకు వీల్లే కుండాపోయిందని గ్రామంలో ఉన్న పాత బోర్లను ప్రెస్సింగ్‌ చేయడం లేక బోర్లను లోతు తవ్వి వచ్చే జూలై మాసం వరకు గ్రామంలో తాగునీటిని వాడుకోవాలన్నారు. తాగునీటి కోసం ప్రతీ జిల్లాకు ముఖ్యమంత్రి రూ.5 కోట్ల నిధులు విడుదల చేశారని తెలిపారు. ఎల్‌నినో ప్రభా వంతో వీబీ జీరాంజీ పథకం ద్వారా 4నెలల పా టు పనులు చేపట్టేందుకు నియోజకవర్గానికి 375 పనులకుగాను రూ. 400కోట్ల నిధులు కేటా యించినట్లు తెలిపారు. కరువు నుంచి బయట పడేందుకు ఈ పథకంలో కూలీల సంఖ్య పెం చేందుకు సర్పంచులు కార్యదర్శులు ప్రత్యేక దృ ష్టి సారించాలన్నారు. అంతకు ముందు అధికా రులు ఎజెండా వారీగా అంశాలను చదివి విని పించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రాఘ వేంద్రసింగ్‌, తహసీల్దార్‌ సునీత, ఏపీవో పర్వతాలు, ఏపీఎం బాల్‌చంద్రయ్య, ఏవో రమే ష్‌ ఐసీడీఎస్‌ సీడీపీవో దమయంతి, ఎంఈవో శ్రీనివాసురెడ్డి ఉన్నారు.

Updated Date - Oct 28 , 2026 | 11:32 PM