Share News

యాప్‌ ద్వారా యూరియా అమ్మకం

ABN , Publish Date - Jan 29 , 2026 | 11:22 PM

యాప్‌ ద్వారా యూరియా అమ్మకాలు జరగాలని కలెక్ట ర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు.

యాప్‌ ద్వారా యూరియా అమ్మకం
హాకా రైతుసేవా కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ సంతోష్‌

- కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- యూరియా పాయింట్ల తనిఖీ

అచ్చంపేట, జనవరి 29(ఆంధ్రజ్యోతి): యాప్‌ ద్వారా యూరియా అమ్మకాలు జరగాలని కలెక్ట ర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. అచ్చంపేట ప ట్టణంలో హాకా రైతు సేవా కేంద్రాన్ని, యూరి యా సరఫరా పాయిట్లల్లో యూరియా ఎరువుల లభ్యత, పంపిణీ పరిస్థితులను గురువారం కలెక్ట ర్‌ తనిఖీ చేశారు. యూరియా నిల్వలు, సరఫరా విధానం, రైతులకు పంపిణీ ప్రక్రియ, స్టాక్‌ రిజి స్టర్ల నిర్వహణ, డిమాండ్‌, సరఫరా సమతుల్యత తదితర అంశాలను కలెక్టర్‌ ఆరా తీశారు. కలె క్టర్‌ మాట్లాడుతూ రైతులు ఫర్టిలైజర్‌ బుకింగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి కొనుగోలు చేసుకోవచ్చ ని తెలిపారు. కలెక్టర్‌ వెంట జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్‌రావు, డివిజన్‌ వ్యవసాయ శాఖ అధికారి చంద్ర శేఖర్‌ పాల్గొన్నారు.

ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల పనులు వెంటనే ప్రారంభించాలి

ఉప్పునుంతల, జనవరి 29 (ఆంధ్రజ్యోతి) : యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశా ల పనులు వెంటనే ప్రారంభించా లని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అ న్నారు. గురువారం ఉప్పునుంతల మండల పరిధిలోని రాయిచేడు గ్రామంలో ని ర్మించనున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసి డెన్షియల్‌ పాఠశాల నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్ధలాన్ని ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఆలస్యం లేకుండా వెంటనే పనులు ప్రారంభించాలని సంబంధింత అఽధికా రులతో సమీక్షించి, ఆదేశించారు. ఆయన వెంట అచ్చంపేట ఆర్డీవో యాదగిరి, ఉప్పునుంతల తహసీల్దార్‌ సునీతతో పాటు పలు శాఖల అధికారులు ఉన్నారు.

Updated Date - Jan 29 , 2026 | 11:22 PM