Share News

కళాశాల విద్యార్థులకు అర్బన్‌ ఎక్స్‌చాలెంజ్‌ ఐడియాథాన్‌ -2026

ABN , Publish Date - May 05 , 2026 | 03:46 AM

దేశంలో అత్యంత వేగంగా పట్టణీకరణ చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో పట్టణాల అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం..

కళాశాల విద్యార్థులకు అర్బన్‌ ఎక్స్‌చాలెంజ్‌ ఐడియాథాన్‌ -2026

హైదరాబాద్‌, మే 4 (ఆంధ్ర జ్యోతి): దేశంలో అత్యంత వేగంగా పట్టణీకరణ చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో పట్టణాల అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం కళాశాల విద్యార్థులు తమ ఆలోచనలు పంచుకోవాలని కోరుతూ అర్బన్‌ ఎక్స్‌చాలెంజ్‌ ఐడియాథాన్‌-2026 పేరుతో పురపాలక శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అర్బన్‌ ఇన్నొవేషన్‌ అండ్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ మేనేజ్‌మెంట్‌, తెలంగాణ పురపాలక శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విభాగాలకు చెందిన డిగ్రీ, పీజీ విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చని పురపాలకశాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం జ్ట్టిఞట://ఠీఠీఠీ.ుఽజీఠఝ.ౌటజ.జీుఽ/ వెబ్‌సైట్‌ను చూడాలని, ఇందులోనే తమ సూచనలను మే 20లోపు నమోదు చేయాలని సూచించారు.

Updated Date - May 05 , 2026 | 03:46 AM