kumaram bheem asifabad- ఆదివాసీ మార్చ్ పోస్టర్ల ఆవిష్కరణ
ABN , Publish Date - Sep 13 , 2026 | 11:34 PM
మండలంలోని జామ్నిలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి బుధవారం నిర్వహించే చలో ఉట్నూర్ ఆదివాసీ మార్చ్ పోస్టర్లను ఆదివారం ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మడావి మధురాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
జైనూర్, సెస్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జామ్నిలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి బుధవారం నిర్వహించే చలో ఉట్నూర్ ఆదివాసీ మార్చ్ పోస్టర్లను ఆదివారం ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మడావి మధురాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ సర్పంచ్ మడావి నాగోరావ్, ఆ సంఘం మండల అధ్యక్షులు కుంర సుధాకర్, ఉపాధ్యక్షుడు మోతిరాం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
సిర్పూర్(యు), (ఆంధ్రజ్యోతి): ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం కోసం బుధవారం నిర్వహించే ఉట్నూర్ ఐటీడీఏ ముట్టడి కార్యక్రమంను విజయవంతం చేయాలని తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు కుమ్ర భీంరావు కోరారు. మండల కేంద్రంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ ఆదివాసీ సమస్యల సాధన కోసం తుడుం దెబ్బ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఆదివాసీలకు సంబంధించిన హక్కులు, సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కాగా తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ కుమార్‌తోపాటు రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు సోమవారం మండల కేంద్రంతోపాటు కోహినూర్,రాఘపూర్ రానున్నరని, ముట్టడి కార్యక్రమానికి సంబంఇంచిన పోస్టర్లు విడుదల కార్యక్రమం ఉంటుందని తెలిపారు.