Share News

అకాల వర్షం...అపార నష్టం

ABN , Publish Date - May 06 , 2026 | 11:51 PM

జిల్లాలో మంగళవారం అర్థరాత్రి కురిసిన అకాల వర్షం వివిధ మండలాల్లోని రైతులు, ప్రజలకు అపార నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షం కారణంగా కొనుగోలు కేంద్రా ల్లో అమ్మకానికి ఉంచిన ధాన్యంతోపాటు కోతకు వచ్చి న పంట పూర్తిగా తడిసి ముద్దకాగా, పెద్ద మొత్తంలో మామిడి నేలరాలి రైతులకు తీరని నష్టం వాటిల్లింది.

అకాల వర్షం...అపార నష్టం
తడిసిన ధాన్యం బస్తాలు

-కొనుగోలు కేంద్రాల్లో నీట మునిగిన ధాన్యం

-3వేల ఎకరాల వరి, 411 ఎకరాల మామిడికి నష్టం

-విరిగిపడ్డ విద్యుత్‌ స్తంభాలు, వృక్షాలు

-ఎగిరిన ఇళ్ల పై కప్పులు, కూలిన గోడలు

మంచిర్యాల, మే 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళవారం అర్థరాత్రి కురిసిన అకాల వర్షం వివిధ మండలాల్లోని రైతులు, ప్రజలకు అపార నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షం కారణంగా కొనుగోలు కేంద్రా ల్లో అమ్మకానికి ఉంచిన ధాన్యంతోపాటు కోతకు వచ్చి న పంట పూర్తిగా తడిసి ముద్దకాగా, పెద్ద మొత్తంలో మామిడి నేలరాలి రైతులకు తీరని నష్టం వాటిల్లింది. గత నాలుగైదు రోజులుగా వాతావరణంలో మార్పులు సంభవిస్తుండగా, ఊహించని రీతిలో అర్థరాత్రి చెల రేగిన గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షాని కి జిల్లాలోని కోటపల్లి, బెల్లంపల్లి, జైపూర్‌, భీమారం, చెన్నూరు, మందమర్రి, కన్నెపల్లి మండలాల్లోని 1830 మంది రైతులకు చెందిన 3191 ఎకరాల వరి ధాన్యం నీటి పాలైంది. అలాగే జైపూర్‌, దండేపల్లి, హాజీపూర్‌ మండలాల్లోని 140 మంది రైతులకు చెందిన 411 ఎ కరాల్లో మామిడి పంట దాదాపు 50 శాతం మేర దెబ్బతిన్నట్లు ఉద్యానశాఖ అధికారులు అంచనా వేస్తు న్నారు. అలాగే వివిధ మండలాల్లో గాలివాన కార ణంగా విద్యుత్‌ స్తంబాలు విరిగి పడి విద్యుత్‌ సరఫ రాలో అంతరాయం ఏర్పడింది. వృక్షాలు రోడ్లకు అడ్డం గా నేలకొరగడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. పలుచోట్ల ఇంటి పైకప్పులు ఎరిగిపోగా, గోడలు కూలిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

రూ. 7 లక్షల పరిహారం...

లక్షెట్టిపేట మండలంలో అకాల వర్షం కారణంగా వేర్వేరు చోట్లా గోడలు కూలి మృతి చెందిన నలుగు రికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు నష్ట పరిహారం ప్రకటించారు. హైద్రాబాద్‌లో ఉన్న ఆయన మృతుల కుటుంబాలను ఉద్దేశించి వీడియో విడుదల చేశారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా రైతు లు ప్రాణాలో కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు తనవంతుగా రూ. 2 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తానని హామీ ఇచ్చారు. అలా గే ప్రభుత్వపరంగా మరో రూ. 5 లక్షల పరిహారం ప్ర కటించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తా నని, క్షతగాత్రులను అన్ని విధాలుగా ఆదుకుంటామ ని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యమే....ఎక్స్‌లో కవిత ట్వీట్‌

నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ది గ్ర్భాంతికి గురి చేసిందని టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు క ల్వకుంట కవిత ఎక్స్‌ వేదికగా ఆరోపణలు చేశారు. స కాలంలో ధాన్యం కొనుగోలు చేయకుండా వారం రో జుల వ్యవధిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడుగురు రైతు లను పొట్టన బెట్టుకుందని ఆరోపించారు. మృతి చెం దిన రైతుల కుటుంబాలను ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆ దుకోవాలని, ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం లేకుండా వేగంగా పూర్తి చేయాలని ఆమె ట్వీట్‌ చేశారు.

రైతులకు తీరని నష్టం

హాజీపూర్‌: ఆరుగాలం రెక్కల కష్టం చేసి అప్పులు జేసి పంటలు సాగు చేస్తే ప్రభుత్వం కొనుగోలు చే యకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతు న్నారు. మంగళవారం రాత్రి మండలంలో కురిసిన అకాల వ ర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వరద తాకిడికి కొట్టుకు పోయింది. నంనూర్‌ కొనుగోలు కేంద్రంలో రైతు పో తురాజు తిరుపతి ఆరబోసిన ధాన్యం మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు నీటిలో మునిగిపోయింది. అధికారులు వచ్చి న్యాయం చేస్తా రని ఎదురు చూసినా రైతు చేసేదేమి లేక వరద నీటి నుంచి ధాన్యాన్ని తోడడం తోటి రైతులను కలిచి వే సింది. కొనుగోలు కేంద్రంలో సంగతి భూమయ్య అనే రైతుకు సంబంధించి మంగళవారం 355 బస్తాలు తూకం వేశారు. కానీ మిల్లుకు తరలించకపోవడంతో సంచుల్లోని ధాన్యం తడిసిపోయింది. గుడిపేట, ము ల్కల, టీకనపల్లి, బుద్దిపల్లి, పెద్దంపేట, పడ్తనపల్లి, రాపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం అ కాల వర్షానికి తడిసిపోవడంతో బుధవారం రైతులు తిరిగి ఆరబెట్టారు. వరద తాకిడికి క్వింటాళ్ల కొద్ది ధాన్యం కొట్టుకుపోయింది. ఇంకా కోతదశలో ఉన్న వరి పొలాలు పూర్తిగా నేలవాలాయి.

-మొక్కజన్నొ రైతులను పట్టించుకునే వారు కరువు

వరిధాన్యం తడిసినా కానీ చివరి గింజ వరకు కొ నుగోలు చేస్తామని చెబుతున్నారు కానీ మొక్కజొన్న వర్షానికి తడిస్తే కాటుక రంగు వస్తుందని అప్పుడు అధికారులు కొనుగోళ్లలో కొర్రీలు పెడతారని రైతులు ఆవేదన చెందుతున్నారు. మండలంలో ఏర్పాటు చేసి న ఏకైక మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సబ్బప ల్లిలో ఏర్పాటు చేశారు. ఇక్కడ నిర్వహణ సరిగ్గా లేక గన్నీ సంచులు ఎవరు పడితే వారు తీసుకుపోయారు. ప్ర స్తుతం తూకం వేయడానికి సంచులు లేక ఎక్కడి కు ప్పలు అక్కడే ఉన్నాయి ప్రైవేటుకు అమ్ము కున్నా త మకు నష్టం ఎక్కువ ఉండకపోవునని కొను గోలు కేం ద్రం నిర్వహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చెన్నూరు : మండలంలో మంగళవారం రాత్రి కు రిసిన ఈదురుగాలులతో కూడిన అకాల వర్షానికి అ స్నాద, లంబడిపల్లి, కొమ్మెర, లింగంపల్లి, అక్కెపల్లి, అంగ్రాజ్‌పల్లి, కిష్టంపేట తదితర గ్రామాల్లోని కొనుగో లు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి పోయింది. కొ న్ని చోట్ల ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు తీవ్రం గా నష్టపోయారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కూ డా కొనుగోలు చేయాలని రైతులు కోరారు. కొనుగోలు కేంద్రాల్లో వెంట వెంటనే కొనుగోలు చేపట్టి మిల్లులకు తరలించాలని కోరారు.

నస్పూర్‌ : నస్పూర్‌లో గాలి వాన ఆందోళన కలి గించింది. భారీగా వీచిన గాలికి చెట్లు, వాటి కొమ్మలు విరిగి సమీపంలోని విద్యుత్‌ లైన్లపై పడడం, కొన్ని చోట్ల నేల కూలాయి. ఒక వైపున వర్షం మరో వైపున భారీగా వీచిన గాలి, ఉరుములు, మెరుపులతో కూడి న అకాల వర్షం ప్రజలను కలవరపర్చింది. గాలివాన కారణంగా ప్రభుత్వ, సింగరేణి విద్యుత్‌ సరఫరా నిలి చిపోయింది. వర్షం వలన డ్రైనేజీలు వర్షపు నీటితో నిండి పొంగిపోర్లాయాయి. సీతారాంపల్లి రైతు వేదిక వద్ద కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం కుప్పలపై కప్పి న కవర్లు గాలి దాటికి కొన్ని ఎగిరిపోవడంతో ధాన్యం కొద్ది మేరకు తడిచింది. బుధవారం ఉదయం కేంద్రం తడిచిన కుప్పల దాన్యంను రైతులు ఆరబెట్టారు. ఉద యం నుంచి విద్యుత్‌ అంతరాయం లేకుం డా సరఫ రా ధావిధిగా కొనసాగే విధంగా చర్యలు చేపట్టారు.

Updated Date - May 06 , 2026 | 11:51 PM